ENGLISH

వయసు మీద పడినా వన్నె తగ్గని సౌందర్యం

19 June 2018-11:20 AM

'ఇష్టం' సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది ముద్దుగుమ్మ శ్రియ. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. చేస్తూనే ఉంది. ఇటీవల పెళ్లి చేసుకున్న శ్రియ, పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్‌ని కొనసాగిస్తూనే ఉంది. యంగ్‌ హీరోస్‌తోనూ నటించే సత్తా, కావాల్సిన గ్లామర్‌ తనలో ఇంకా ఏమాత్రం తగ్గలేదంటోంది. ఏజ్‌ ఎక్కువైనా ఏమాత్రం క్రేజ్‌ తగ్గని హీరోయిన్‌గా శ్రియ పేరు ముందు వరుసలో వుంచొచ్చు. 

ప్రస్తుతం శ్రియ చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. తెలుగు విషయానికి వస్తే, తాజాగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాతో శ్రియ ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ డైరెక్టర్‌ సుజనా ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ తొలి నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ఈ సినిమాలో మెగా డాటర్‌ నిహారిక కీలక పాత్రలో నటిస్తోంది. ఇకపోతే, శ్రియ కెరీర్‌ తొలి నాళ్ల నుండీ ఇప్పటి వరకూ బిజీగానే గడుపుతోంది. శ్రియ కెరీర్‌కి ఎప్పుడూ బ్రేక్‌ రాలేదనే చెప్పాలి. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే, మరోవైపు ఐటెం సాంగ్స్‌లోసూ అదిరిపోయే హాట్‌నెస్‌తో అలరించింది. గతేడాది బాలయ్యతో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టింది. రెండు సినిమాల్లో వరుసగా బాలయ్యతో నటించి మెప్పించింది. 

ఇప్పుడు తాజాగా మరోసారి శ్రియ, బాలయ్య సినిమాలో నటించనుందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఇకపోతే విక్టరీ వెంకటేష్‌తో శ్రియ నటించాల్సిన సినిమా అనూహ్యంగా సెట్స్‌ మీదికి వెళ్లలేదు. దాంతో వెంకీతో జత కట్టే ఛాన్స్‌ తృటిలో మిస్‌ చేసుకుంది శ్రియ. 

ఇవే కాదు, శ్రియ కోసం మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.

ALSO READ: అనసూయని విచారించిన ఇంటర్ పోల్?!