ENGLISH

శృతిహాసన్‌ గ్లామర్‌ 'ఆర్ట్‌' అదిరిందిలే!

09 March 2018-19:43 PM

ఫ్యాషన్‌ అనేది ఓ ఆర్ట్‌ అంటోంది ముద్దుగుమ్మ శృతిహాసన్‌. గ్లామర్‌కే కాదు, డిఫరెంట్‌ ఫ్యాషన్‌కీ శృతిహాసన్‌ని కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పవచ్చు.

 

హీరోయిన్‌గా ఆన్‌స్క్రీన్‌ గ్లామర్‌ని పక్కన పెడితే, ఆఫ్‌ స్క్రీన్‌ ఫ్యాషన్‌ని ఫాలో అవడంలోనూ శృతిది డిఫరెంట్‌ స్టైలే. హీరోయినే కాకుండా, మల్టీటాలెంటెడ్‌ శృతిహాసన్‌. ముఖ్యంగా పాప్‌ సంగీతం అంటే శృతికి చాలా ఇష్టం. సొంతంగా ఎన్నో పాప్‌ గీతాలను కంపోజ్‌ చేసింది. కొంచెం టైం దొరికినా, పాప్‌ సంగీతం పైనే ఎక్కువగా దృష్టి పెడుతుందట శృతి. ప్రస్తుతం శృతిహాసన్‌ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ తనకెంతో ఇష్టమైన మ్యూజిక్‌ని అయితే ఫాలో అవుతూనే ఉందట. 

సోషల్‌ మీడియాలో తాజాగా శృతి పోస్ట్‌ చేసిన ఈ ఫోటో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. అందుకు కారణం శృతి వేసుకున్న టాప్‌. ఈ టాప్‌ చాలా బావుంది అనేదానికన్నా, సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ టాప్‌లో ఒదిగిన డిజైన్‌ ఓ ఆర్ట్‌ అట. అదే ఆర్ట్‌ డిజైన్‌తో ఉన్న హై హీల్స్‌ శృతి గ్లామర్‌కి మరో స్పెషల్‌ అట్రాక్షన్‌.

ALSO READ: తాజా సంచలనం: షకీలా పాత్రలో రిచా