ENGLISH

శ్రుతిహాస‌న్ కి పెళ్ల‌యిపోయిందా?!

27 December 2023-11:04 AM

సోష‌ల్ మీడియా పెరిగిపోయాక‌.. ర‌క‌ర‌కాల వార్త‌లు, ర‌క‌ర‌కాల రూపాల్లో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఏది నిజ‌మో, ఏది కాదో ఎవ‌రూ తేల్చి చెప్ప‌లేని ప‌రిస్థితి. తాజాగా శ్రుతిహాస‌న్ పై కూడా ఓ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. శ్రుతి సైలెంట్ గా పెళ్లి చేసేసుకొంద‌న్న‌ది ఆ వార్త‌ల్లోని సారాంశం.


సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ ఓరీ శ్రుతిహాస‌న్‌కి పెళ్లయిపోయింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో మేట‌ర్ లీక్ చేశాడు. ఓరికి సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా సెల‌బ్రెటీల‌తో స‌న్నిహితంగా మెలుగుతుంటాడు. అందుకే ఓరి మాట‌ని చాలా మంది న‌మ్మారు. శ్రుతి నిజంగానే పెళ్లి చేసుకొందేమో అని ఫిక్స‌వుతున్నారు. దాంతో.. శ్రుతిహాస‌న్ రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు.


''నాకింకా పెళ్లి కాలేదు. ప్ర‌తీ విష‌యాన్ని పంచుకొనే నేను, పెళ్లి విష‌యం ఎందుకు దాస్తాను?'' అంటూ క్లారిటీ ఇచ్చేసింది. దాంతో శ్రుతి పెళ్లి వార్త‌ల‌కు చెక్ ప‌డిన‌ట్టైంది. ప్ర‌ముఖ సంగీతకారుడు శాంత‌నుతో శ్రుతి చాలాకాలంగా ప్రేమ‌లో ఉంది. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకొన్నారంటూ గ‌తంలోనూ చాలాసార్లు వార్త‌లొచ్చాయి. అయితే వాటిపై శ్రుతి ఎప్పుడూ మాట్లాడ‌లేదు. ఈసారి మాత్రం స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌డంతో పెళ్లి వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్టైంది.