ENGLISH

శ్రుతి ఫైటింగులు మామూలుగా ఉండ‌వ‌ట‌!

23 June 2021-14:41 PM

శ్రుతిహాస‌న్‌... ఫేడ‌వుట్ అయిపోతోంద‌నుకుంటున్న త‌రుణంలో.. వ‌రుస‌గా రెండు సినిమాలు చేసేసింది. క్రాక్‌, వ‌కీల్ సాబ్ రెండూ హిట్సే. వ‌కీల్ సాబ్ లో త‌న పాత్ర ప‌రిధి చాలా త‌క్కువ‌. క్రాక్‌లోనూ ఇంచుమించుగా అంతే. కానీ.. క్రాక్‌లో త‌న యాక్ష‌న్ తో అద‌ర‌గొట్టేసింది. ఓ యాక్ష‌న్‌సీన్‌లో విజృంభించి న‌టించింది. శ్రుతిలో ఇంత ఫైర్ ఉందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

 

ఇప్పుడు మ‌రోసారి త‌న యాక్ష‌న్ త‌డాఖా చూపించ‌బోతోంద‌ట‌. స‌లార్ సినిమాలో. ప్రభాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. ఇందులో శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిపైకొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌బోతున్నార్ట‌. ఆ సీన్ల‌న్నీ హాలీవుడ్ రేంజులో ఉంటాయ‌ని తెలుస్తోంది. అందుకోసం శ్రుతి మార్ష‌ల్ ఆర్ట్స్ లో కూడా ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకున్న‌ట్టు స‌మాచారం. స‌లార్‌.. ఫుల్ ప్యాక్డ్ యాక్ష‌న్ మూవీ. ఇందులో ప్రభాస్ తో పాటుగా.. శ్రుతి కూడా యాక్ష‌న్ లో వాటా తీసుకుంటుంద‌న్న‌మాట‌. చూస్తుంటే... శ్రుతి లో రొమాంటిక్ యాంగిల్ త‌గ్గి, యాక్ష‌న్ పై ధ్యాస పెరిగిన‌ట్టుంది.

ALSO READ: మహేష్ బాబు రిలీజ్‌ చేసిన అశోక్‌ గల్లా 'హీరో' టైటిల్ టీజర్.