ENGLISH

శృతిహాసన్‌ సినిమాలు మానేసిందా?

08 March 2018-15:14 PM

స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన శృతిహాసన్‌ ప్రస్తుతం సినిమాలు చేయడంలేదు. తెలుగులో 'గబ్బర్‌సింగ్‌', 'రేసుగుర్రం', 'ఎవడు' తదితర సూపర్‌ హిట్‌ సినిమాలు శృతిహాసన్‌ డైరీలో ఉన్నాయి. అలాగే, తమిళ, హిందీ భాషల్లో కూడా పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో శృతిహాసన్‌ నటించింది. అయితే ప్రస్తుతం శృతిహాసన్‌ మాట ఎక్కడా వినిపించడం లేదు. 

ఆ మధ్య బోయ్‌ ఫ్రెండ్‌తో శృతిహాసన్‌ పెళ్లి అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే తను కేవలం బోయ్‌ ఫ్రెండ్‌ మాత్రమేననీ, లవర్‌ కాదనీ, శృతిహాసన్‌ ఖండించేసింది. దాంతో శృతి పెళ్లి బురు కూడా ఉత్తదేనేమో అని తేలిపోయింది. అయితే తాజాగా శృతి చేతిలో ఇటు తెలుగులో కానీ, ఇతర భాషల్లో కానీ సినిమాలు లేవు. తమిళంలో తండ్రితో కలిసి చేస్తున్న 'శభాష్‌ నాయుడు' సినిమా తప్ప. అయితే శృతికి సంబంధించిన ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఏంటంటే, తండ్రి కమల్‌తో పాటు శృతిహాసన్‌ కూడా రాజకీయాల్లో బిజీ కానుందని తెలుస్తోంది. 

ఈ మధ్య కమల్‌ హాసన్‌ రాజకీయాల్లో కొత్త పార్టీ స్థాపించి, పొలిటికల్‌గా బిజీ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన సినిమాలకు దాదాపు టాటా బైబై చెప్పేసినట్లే. ఇకపోతే తండ్రి బాటలోనే కూతురు శృతిహాసన్‌ కూడా నడవబోతోందా? అంటే ఏమో అలాగే అనిపిస్తోంది. కొత్త భామలు ఎంత మంది ఉన్నా, తన తోటి హీరోయిన్లు అయిన కాజల్‌, సమంత, అనుష్క, తమన్నా తదితర ముద్దుగుమ్మలు వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ రేసులో కొత్త హీరోయిన్స్‌తో పోటీ పడుతూనే ఉన్నారు. 

అలాంటిది శృతిహాసన్‌ ఈ టైంలో సినిమాలకు టాటా చెప్పేయడమేంటి.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. చూడాలి మరి ఇది జస్ట్‌ గాసిప్‌ మాత్రమేనా? లేక నిజమా? తెలియాల్సి ఉంది.

ALSO READ: మోడీని టార్గెట్ చేసిన మోహన్ బాబు