ENGLISH

నిర్మాతగా మారుతున్న హాట్‌ బ్యూటీ

21 June 2018-11:38 AM

అందాల భామ శృతిహాసన్‌ నిర్మాతగా మారుతోందట. జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో శృతిహాసన్‌ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోందట. తమిళ, తెలుగు, హిందీ బాషల్లో ఈ సినిమా విడుదల కానుందట. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా వుంటుందట ఈ సినిమా. 

గతంలో 'లెన్స్‌' అనే సినిమాకి దర్శకత్వం వహించిన జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ డైరెక్టర్స్‌లో తన రూటే సెపరేటు అనేలా సినిమాలు ఎంచుకుంటారు. అలాంటి రాధాకృష్ణన్‌ సినిమాతో నిర్మాతగా మారాలనుకున్న శృతిహాసన్‌ని మెచ్చుకుని తీరాలి. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక హంగులతో ఈ సినిమా రూపొందనుందని సమాచారమ్‌. బడ్జెట్‌ విషయంలో శృతిహాసన్‌ ఎక్కడా రాజీపడదలచుకోలేదట. ఇసిడ్రో అనే కొత్త బ్యానర్‌ స్థాపించి, ఆ బ్యానర్‌పైనే ఇకపై అభిరుచి గల సినిమాలను నిర్మించే యోచనలో శృతిహాసన్‌ ఉందట. 

తాజా సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి చేయనుంది. మరోవైపు శృతిహాసన్‌కి హీరోయిన్‌గా ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేవు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కాస్త కూడా తీరిక లేకుండా సినిమాలు చేసేసిన శృతిహాసన్‌ ఇప్పుడు ఎక్కడా సినిమాలు చేయడం లేదు. ఇటీవలే తెలుగులో రెండు సినిమాలకు శృతి సైన్‌ చేసిందని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి మాస్‌ రాజా రవితేజతో కాగా, నేచురల్‌ స్టార్‌ నానితో మరో సినిమా అని తెలుస్తోంది. అయితే వీటి విషయంలో అఫీషియల్‌ క్లారిటీ లేదు. 

చూడాలి మరి, హీరోయిన్‌గా పక్కకు తప్పుకుని ఒకవేళ శృతిహాసన్‌ నిర్మాతగా సెటిలైపోతుందేమో.

ALSO READ: సుధీర్ తో పెళ్ళి పైన క్లారిటీ ఇచ్చిన రష్మి