ENGLISH

బ‌న్నీ పాత్ర‌కు హీరో దొరికేశాడు!

05 February 2022-14:00 PM

అల్లు అర్జున్ - హ‌రీష్ శంకర్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న `దువ్వాడ జ‌గ‌న్నాథ్‌` (డీజే) సూప‌ర్ హిట్ట‌య్యింది. ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ పాత్ర‌లో అక్క‌డ ఎవ‌రు క‌నిపిస్తారా? అంటూ ఆస‌క్తిగా ఎదురు చూశారు జ‌నాలు. ఇప్పుడు ఆ హీరో ఖాయం అయిపోయాడు. త‌నే సిద్దార్థ్ మ‌ల్హోత్రా. ఇటీవ‌లే సిద్దార్థ్ - హ‌రీష్‌ల మ‌ధ్య భేటీ జ‌రిగింది. హ‌రీష్ స్క్రిప్టు సిద్దార్థ్ కి బాగా న‌చ్చింది. వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశాడు.

 

గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ త‌ర‌వాత హ‌రీష్ మ‌రో సినిమా చేయ‌లేదు. అయితే.. ప‌వ‌న్ కి ఓ క‌థ చెప్పి లాక్ చేశాడు. అదే `భ‌వ‌దీయుడు.. భ‌గ‌త్ సింగ్‌`. కానీ ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఆల‌స్యం అవుతోంది. ఈలోగా.. మ‌రో సినిమా చేయాల‌ని హ‌రీష్ ఫిక్స‌వ్వ‌డం, డీజేని హిందీలో రీమేక్ చేయ‌మ‌ని ఆఫ‌ర్ రావ‌డం జ‌రిగిపోయాయి. అందుకే ముందు హిందీలో డీజే చేసి, ఆ త‌ర‌వాత‌.. ప‌వ‌న్ సినిమా ప‌నులు మొద‌లెడ‌తాడ‌ట‌. ప‌వ‌న్ సినిమా స్క్రిప్టు ఆల్రెడీ లాక్ అయిపోయింది కాబ‌ట్టి.. దాన్ని ఎప్పుడైనా స‌రే, ప‌ట్టాలెక్కించొచ్చు. అందుకే హిందీ సినిమాపై ఫోక‌స్ చేశాడు హ‌రీష్‌.

ALSO READ: జ‌న‌సేన‌లో మళ్లీ చక్రం తిప్పుతాడా?