ENGLISH

స్వీటీ కోసం ఎదురు చూపులు: ఇంకెన్నాళ్లూ?

03 February 2020-11:00 AM

గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క 'నిశ్శబ్ధం' అను బహు భాషా చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుందని అభిమానులు తెగ సంబరపడిపోయారు. జనవరి 31న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుందన్న ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఆ రోజు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కానీ, స్వీటీ మాత్రం రాలేదు. జనవరి 31న తెలుగులో రిలీజైన 'అశ్వథ్ధామ' సినిమా ఓ మోస్తరు హిట్‌ టాక్‌ సంపాదించిందనుకోండి. నిజానికి నాగశౌర్యకు ఎంతో ఇష్టమైన అనుష్క సినిమాతో తాను పోటీకి దిగుతున్నందుకు ఆనందపడ్డాడు. తన సినిమాతో పాటు అనుష్క సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకున్నాడు. కానీ, ఎందుకో ఆ రోజు 'నిశ్శబ్ధం' విడుదల కాలేదు. అందుకు గల కారణాలను కూడా చిత్ర యూనిట్‌ వెల్లడించలేదింతవరకూ. దాంతో ఫ్యాన్స్‌ బాగా డిజాప్పాయింట్‌ అయ్యారు.

 

స్వీటీని తెరపై చూసేందుకు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలా.? అని ఆలోచిస్తున్నారు. అయితే, షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'నిశ్శబ్ధం' పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు లేట్‌ అవుతున్న కారణంగానే విడుదలకు నోచుకోలేదని అంటున్నారు. ఎక్కువగా అమెరికాలో షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కీ చోటుందట. ఆదే రిలీజ్‌ డిలే కావడానికి కారణమంటున్నారు. అయితే, కారణమేదైనా, చిత్ర యూనిట్‌ నుండి ఏదో ఒక అప్‌డేట్‌ వస్తే కానీ, ఫ్యాన్స్‌ నుండి ఒత్తిడి తట్టుకోవడం కష్టమే. సో రిలీజ్‌పై స్వీటీ కానీ, చిత్ర యూనిట్‌ కానీ మౌనం వీడాల్సి ఉంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాధవన్‌ హీరోగా నటిస్తుండగా, అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ALSO READ: 'అశ్వథ్ధామ'కు బేబీ ప్రశంసలు.!