ENGLISH

మ‌ళ్లీ మేక‌ప్ వేసుకుంటున్న సిమ్రాన్‌

27 July 2021-14:04 PM

ఒక‌ప్ప‌టి అగ్ర క‌థానాయిక‌లు ఇప్పుడు అమ్మ‌, అత్త‌మ్మ పాత్ర‌ల్లో ఒదిగిపోతున్నారు. వాళ్ల‌కు భారీ పారితోషికాలు ద‌క్కుతున్నాయి. సిమ్రాన్ కూడా అలా కొన్ని సినిమాల్లో ట్రై చేసింది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో కొంత‌కాలంగా సైలెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు సిమ్రాన్ మ‌రోసారి మేక‌ప్ వేసుకోబోతోంద‌ని స‌మాచారం. అదీ త‌మిళ సినిమాలో.

 

కార్తి క‌థానాయ‌కుడిగా త‌మిళంలో తెరకెక్కుతున్న చిత్రం `స‌ర్దార్‌`. రాశీఖ‌న్నా క‌థానాయిక‌. మిత్రాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో సిమ్రాన్ ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతోంద‌ట‌. కార్తికి త‌ల్లిగా సిమ్రాన్ క‌నిపించే అవ‌కాశాలున్నాయని టాక్. నిజానికి ఈ సినిమాలో న‌టించ‌డానికి సిమ్రాన్ ఒప్పుకోలేద‌ని స‌మాచారం. కానీ భారీ పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డంతో.. సిమ్రాన్ ఓకే అనేసింద‌ట‌. అంతేకాదు.. ఈ సినిమాలో సిమ్రాన్ పాత్ర కూడా వైవిధ్యంగా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. ఈ సినిమా హిట్ట‌యితే.. టాలీవుడ్లోనూ ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కే ఛాన్సుంది.

ALSO READ: న‌వ‌ర‌స ట్రైల‌ర్ టాక్‌: మేటి న‌టుల క‌ల‌యిక‌