ENGLISH

అతను ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తా: ఎస్ జే సూర్య

04 October 2017-13:25 PM

తమిళనాడులో జయలలిత మరణం తరువాత ఏర్పడిన రాజకీయ శూన్యతని దృష్టిలో పెట్టుకొని అక్కడ రాజకీయాల్లోకి కొత్త నీరు ప్రవేశించే ప్రయత్నం జరుగుతున్నది. ఇందులో భాగంగానే తమిళ చిత్రసీమ నుండి పలువురు స్టార్ హీరోలు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి చూపుతున్నారు.

ఇక అభిమానులు సైతం తమ అభిమాన హీరోలు రాజకీయాల్లోకి రావాలని కొరుకుంటున్నారు. ఈ కోవలోకే దర్శకుడు-నటుడు అయిన ఎస్ జే సూర్య చేరిపోయాడు. సూర్య మాట్లాడుతూ- రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు అని అలాగే సమాజం పట్ల బాధ్యతతో మెలిగే ఇళయతళపతి విజయ లాంటి వ్యక్తులు వస్తే ఇంకా మంచిది అని చెప్పాడు. ఇక విజయ్ ముఖ్యమంత్రి అయితే మాత్రం తనకి చూడాలని ఉంది అని తెలిపాడు.

ఇదిలావుండగా విజయ తాజా చిత్రం మెర్సల్ లో ప్రతినాయకుడిగా ఎస్ జే సూర్య కనిపించనున్నాడు.

 

ALSO READ: రెండవ పెళ్ళి పై రేణు దేశాయ్ పోస్ట్ రేపిన కలకలం