ENGLISH

చైతన్య - శోభిత ప్రేమాయణం మొదలైంది ఇలా...

18 December 2024-16:36 PM

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఒక ఇంటర్వ్యూ లో వీరి ప్రేమ, పెళ్ళి, మొదటి పరిచయం, ఎవరు ఎవరికి, ఎప్పుడు ప్రపోజ్ చేసారు అన్న పలు విషయాలు షేర్ చేసుకున్నారు. అక్కినేని ఫాన్స్ కి కూడా ఎప్పటినుంచో చైతు, శోభిత కలిసి సినిమాలు చేయలేదు కానీ ఎలా పరిచయం అయ్యింది, వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అన్న డౌట్స్ వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ చైతు, శోభిత ఆన్సర్స్ ఇచ్చారు.

శోభిత 2018లో ఫస్ట్ టైం నాగార్జున ఇంటికి వెళ్లిందట. అపుడు చైతూతో పరిచయం ఏర్పడలేదు కానీ 2022 ఏప్రిల్ తర్వాత వీరి మధ్య పరిచయం మొదలైందని శోభిత తెలిపింది. చైతు ఒక ఫుడ్ ఐటెం గూర్చి పోస్ట్ చేయగా మంచి ఫుడీ అయిన శోభిత లైక్ చేయటం, ఇక అప్పటి నుంచి ఇనిస్టాలో చాటింగ్స్ చేసేవారంట. వీరిద్దరూ ఎక్కువగా ఫుడ్ గూర్చి మాట్లాడుకునే వారని శోభిత తెలిపింది. చైతూకి తెలుగులో మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టమని, చైతుకి ఇంగ్లీష్, తమిళం మాత్రమే బాగా వచ్చని అందుకే శోభితని తెలుగులో మాట్లాడమని కోరేవాడని, ఒకరకంగా అదే మా బంధాన్ని దగ్గరచేసింది అని శోభిత తెలిపింది.

మొదట స్నేహం మొదలై నెమ్మదిగా ప్రేమగా మారింది అని, వీరి ఫస్ట్ డేట్ కి ముంబైలో ఒక కేఫ్ కి వెళ్లారని, నెక్స్ట్ కర్ణాటకలోని ఓ పార్క్ కు వెళ్లామని, అక్కడే ఒకరికొకరం గోరింటాకు కూడా పెట్టుకున్నామని శోభిత సీక్రెట్ రివీల్ చేసింది. చైతు ఫ్యామిలీ తనను న్యూ ఇయర్ వేడుకలకు పిలిచారని, తరవాత వన్ ఇయర్ కి శోభిత ఫ్యామిలీని నాగ్ ఫ్యామిలీ కలిసారట. 2024 లోనే  గోవాలో చైతు శోభితకి మ్యారేజ్ ప్రపోజల్ చేశాడని తెలుస్తోంది. వెంటనే నిశ్చితార్ధం, పెళ్లి జరిగినట్లు ఈ జంట ఆనందంగా షేర్ చేసుకున్నారు.

ALSO READ: అమీర్ ఖాన్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబో