కరోనా కాలంలో టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయాడు సోనూసూద్. తాను చేసిన సేవాకార్యక్రమాలు, చూపిస్తున్న ఉదారత.. అంతటా చర్చకు కారణమయ్యాయి. అప్పటి నుంచీ మీడియా ఫోకస్ సోనూపై బాగా పడింది. అది ప్లస్సే అయినా.. అందులో మైనస్ లేంటో ఇప్పుడే సోనూకీ అర్థమవుతున్నాయి. తాను ఏం చేసినా, చేస్తున్నా భూతద్ధంలో పెట్టి చూడడం బాగా అలవాటైపోయింది. దాంతో అప్పుడప్పుడూ విమర్శల పాలూ అవుతున్నాడు. తాజాగా సోనూసూద్ తనయుడు ఇషాన్‌కు రూ.3 కోట్ల ఖరీదైన కారుని గిఫ్టుగా ఇచ్చాడని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.
ఫాదర్స్ డే సందర్భంగా సోనూ.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ కారులో షికారుకెళ్లారు. దాని ఖరీదు 3 కోట్లు. దాంతో.. సోనూ తన తనయుడికి ఈ కారు బహుమతిగా ఇచ్చాడని చెప్పుకున్నారు. దీనిపై సోనూ క్లారిటీ ఇచ్చేశాడు. . ‘‘ఫొటోల్లో కనిపిస్తోన్న కారుని ట్రయల్స్ కోసం తీసుకొచ్చాం. ఫాదర్స్ డే రోజున పిల్లలు తండ్రికి గిఫ్ట్ ఇస్తారు కానీ.. తండ్రి ఇవ్వడు. ఈ విషయంలో నాపై వస్తున్న విమర్శలకు అండగా నిలబడుతున్నవారికి ధన్యవాదాలు’’ అని సోనూ తెలిపాడు. దాంతో.. ఈ వార్తలకు చెక్ పడినట్టైంది. కారు ట్రయల్ కి వెళ్లారంటే, సోనూ కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నాడన్నమాట. కొనేస్తే... జనాలు ఇంకేమంటారో?
ALSO READ: Vijay Setupathi in consideration for The Family Man Season 3