ENGLISH

మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా బాలు ఆరోగ్యం

24 September 2020-18:47 PM

క‌రోనా బారీన ప‌డిన ఎస్‌.పిబాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం... గ‌త కొద్ది రోజులుగా చైన్నైలోకి ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయ‌న కొద్ది కొద్దిగా కోలుకుంటున్నార‌గానే.. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం తిర‌గ‌బ‌డింద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం బాలు ప‌రిస్థితి అత్యంత విష‌మ‌ప‌రిస్థితిలో ఉంద‌ని చెబుతూ ఆసుప‌త్రి వ‌ర్గాలు హెల్త్ బుటిలెన్ విడుద‌ల చేశాయి.

 

ఇటీవ‌లే బాలు క‌రోనా నుంచి కూడా కోలుకున్నారు. కానీ... క‌రోనా ద్వారా వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆయ‌న ప‌రిస్థితి రోజు రోజుకీ క్షీణించింద‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే ఆయ‌న ఘ‌నాహారాన్ని కూడా అందుకుంటున్నారు. సంగీతం వింటున్నార‌ని, మ‌నుషుల్ని గుర్తు ప‌డుతున్నార‌ని ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ చెప్పేవాడు. బాలు త్వ‌ర‌లోనే ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అవుతార‌ని అనుకుంటే.. ఈలోగా ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.

sp balu health bulletin

ALSO READ: ప్రభాస్ కొత్త సినిమా త్వరలో ప్రకటించబోతున్నారా?