ENGLISH

సెంచరీకి చేరువలో 'స్పైడర్‌'

01 October 2017-08:31 AM

టాక్‌తో సంబంధం లేకుండా 'స్పైడర్‌' వసూళ్లు కొల్లగొట్టేస్తున్నాడు. రెండు రోజుల్లో 72 కోట్లు వసూళ్లు సాధించింది 'స్పైడర్‌' సినిమా. టాక్‌ ఎలా ఉన్నా, ప్రశంసల జోరు కొనసాగుతోంది. అందుకు సమాంతరంగా వసూళ్లు కూడా సాధిస్తోంది 'స్పైడర్‌'. రెండు రోజుల్లో ఈ స్థాయిలో వసూళ్లు అంటే రికార్డుగానే పరిగణించొచ్చు. ఓవర్సీస్‌లో అయితే కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధిస్తోంది 'స్పైడర్‌'. నిన్నటికి అమెరికాలో 'స్పైడర్‌' వసూళ్లు మైండ్‌ బ్లోయింగ్‌. ఏకంగా 1,182,608 డాలర్లు వసూళ్లు కొల్లగొట్టింది. అంటే అక్షరాలా 7.73 కోట్లు. ప్రీమియర్స్‌తో కలిపి ఈ రోజుకి 'స్పైడర్‌' సాధించిన వసూళ్ల లెక్క ఇది. అంటే మూడు రోజుల్లోనే 'స్పైడర్‌' 10 కోట్లు సాధించడం చాలా తేలిక. అక్కడ మహేష్‌కున్న క్రేజ్‌ అలాంటిది. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు నుండీ టాక్‌కి భిన్నంగా వసూళ్లు కొల్లగొడుతోంది. ఓవర్సీస్‌లో మహేష్‌కి తిరుగే లేదని 'స్పైడర్‌' మరో సారి నిరూపించింది. గ్రాస్‌ లెక్కల్లో 72 కోట్లు వసూళ్లు తెచ్చిపెట్టింది. ఇది ఇంకా ఇప్పటి లెక్కే. ఇకపై 'స్పైడర్‌' వసూళ్లు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అంచనాలకే అందడం లేదు. కథ చాలా బాగుంది. మహేష్‌ యాక్టింగ్‌ సూవర్బ్‌, విలన్‌ అదరగొట్టేశాడు, హీరోయిన్‌ స్టైలిష్‌ లుక్‌ అదుర్స్‌.. అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏకంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ సినిమాని చూసి, బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అందించడం విశేషం. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఎస్‌.జె.సూర్య విలన్‌గా నటించాడు.

ALSO READ: మెగా-నందమూరి ఫ్యామిలీల సెల్ఫీ