ENGLISH

గాలి సంప‌త్‌.. వెనుక క‌థేమిటి?

20 November 2020-10:35 AM

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్పుడు నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. శ్రీ విష్ణు న‌టిస్తున్న‌ `గాలి సంప‌త్‌`కి ఆయ‌నే నిర్మాత. దీనికి అనీష్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఎప్ప‌టి నుంచో ఓ మంచి ప్రాజెక్టు కోసం అనిల్ రావిపూడి అన్వేషిస్తున్నాడు. నిర్మాత‌గా తొలి అడుగు ప్రోఫిట్ ఫుల్ వెంచ‌ర్ అవ్వాల‌న్న‌ది త‌న బ‌ల‌మైన కోరిక‌. ఎట్ట‌కేల‌కు `గాలి సంప‌త్‌` దానికి శ్రీ‌కారం చుట్ట‌గ‌లిగాడు. నిజానికి ఈ ప్రాజెక్టు చేయాల్సింది దిల్ రాజునే.

 

త‌న బ్యాన‌ర్‌లో ఈ సినిమా చేయాలి.కానీ. అనిల్ రావిపూడి కోసం ఈ సినిమాని అనిల్ రావిపూడి కోసం త్యాగం చేసిన‌ట్టు స‌మాచారం. ఓ సంద‌ర్భంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి ఇద్ద‌రూ క‌లిసి నిర్మాత‌లు గా వ్య‌వ‌హ‌రింద్దాం అనుకున్నార్ట‌. ఇది చిన్న సినిమా. దానికి ఇద్ద‌రు నిర్మాత‌లెందుకు,పైగా తొలి సినిమా సోలోగా చేస్తే బెట‌ర్ అన్న ఉద్దేశ్యంతో.. దిల్ రాజు పూర్తిగా త‌ప్పుకున్నాడ‌ని టాక్‌. ఒకే ఒక్క షెడ్యూల్ లో ఈ సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది ధ్యేయంగా పెట్టుకున్నారు. నెల రోజుల్లోనే షూటింగ్ పూర్త‌యిపోతుంది.

ALSO READ: 'మిడిల్ క్లాస్ మెలొడీస్‌' మూవీ రివ్యూ & రేటింగ్!