ENGLISH

నానిని భార్యని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

16 June 2018-17:11 PM

యంగ్‌ హీరో, నేచురల్‌ స్టార్‌ నాని క్యారెక్టర్‌ని వీలైనంత ఎక్కువ డ్యామేజ్‌ చేయాలని కంకణం కట్టుకున్నట్లుంది శ్రీరెడ్డి. 

సినీ పరిశ్రమలో ఎవర్ని కదిలించినా, నాని వ్యక్తిత్వం గురించి గొప్పగా చెబుతారు. 'నచ్చావులే' ఫేం మాధవీలత ఓ ఇంటర్య్వూలో నాని గురించి మాట్లాడుతూ, సెట్‌లో ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే, నాని అస్సలు ఊరుకోడనీ, మహిళల పట్ల చాలా గౌరవ భావంతో ఉంటాడనీ చెప్పింది. మాధవీలత మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో ఎవర్ని కదిపినా ఇదే మాట వస్తుంది. కానీ శ్రీరెడ్డి మాత్రం నాని అంటే, మదపిచ్చోడు అన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ నాని మీద పలు రకాల ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా నాని భార్య మీద కూడా విరుచుకుపడింది. 

'నీ మొగుడు నువ్వు అనుకున్నంత శ్రీరామ చంద్రుడు కాదు, నాతో పడుకున్నాడు. చాలా మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. అవేమీ నువ్వు చూడలేదు కదా..త్వరలోనే ఆధారాలతో సహా నాని బాగోతాన్ని బయట పెడతాను..' అని సోషల్‌ మీడియాలో బాంబ్‌ పేల్చింది. 

వాస్తవానికి ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే పోలీసుల్ని ఆశ్రయిస్తారు. సోషల్‌ మీడియాలో కూడా పెట్టొచ్చు. కానీ శ్రీరెడ్డి అలా చేయడం లేదు. వీలైనంత ఎక్కువ పబ్లిసిటీ పొందడానికి అత్యంత దిగజారుడుతనం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే నాని శ్రీరెడ్డికి లీగల్‌ నోటీసులు పంపాడు. అయినా శ్రీరెడ్డి జుగుప్సాకరమైన పబ్లిసిటీ స్టంట్‌ ఆపడం లేదు.
 

ALSO READ: నా నువ్వే మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవుతారు