ENGLISH

శ్రీదేవి 300 - అయినా కొత్తగానే

05 June 2017-17:13 PM

శ్రీదేవి ప్రధాన పాత్రలో రానున్న సినిమా 'మామ్‌'. త్వరలోనే ఈ సినిమా ధియేటర్లో సందడి చేయనుంది. శ్రీదేవి కెరీర్‌లో 300వ సినిమా అట ఇది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసింది ముద్దుగుమ్మ శ్రీదేవి. నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఇండియా అంతటా ప్రశంసలు అందుకుంది. పెళ్ళయిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చేసింది శ్రీదేవి. అందరూ ఆమెను ఓ ఆరాధ్య దేవతలా భావిస్తారు. అంతులేని అభిమానం ఆమె సొంతం. అందుకే మళ్లీ ఆ అభిమానాన్ని పంచుకునేందుకే రీ ఎంట్రీ ఇచ్చింది. రీ-ఎంట్రీలో శ్రీదేవి 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' సినిమాలో నటించింది. ఈ సినిమాలో శ్రీదేవి పండించిన ఎమోషన్స్‌ ఆమెని మరింత ప్రేక్షకులకి దగ్గర చేశాయి. ఆ తర్వాత తమిళంలో 'పులి' సినిమా చేసిన శ్రీదేవి, ఈ సినిమాలో నెగిటివ్‌ రోల్‌లో నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా, ఆమె నటనతో ఎప్పటిలానే మంచి మార్కులు వేయించుకుంది. తాజాగా 'మామ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుదీర్ఘ అనుభవం నటనలో ఉన్నా ఇంకా తాను కొత్త నటినే అనే భావనతో సినిమాలు చేస్తుందట శ్రీదేవి. నేటి తరం నాయికలు ఈ విషయం గమనించాలంటోంది. అదే తన సక్సెస్‌ సీక్రెట్‌ అని కూడా ఆమె చెప్పింది. కుమార్తె కోసం తపన పడే ఓ తల్లి కథ 'మామ్‌'. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

 

ALSO READ: 'బాహుబలి'ని దాటేస్తా: 'ట్యూబ్‌లైట్‌' సల్మాన్‌