ENGLISH

'అమ్మ చెప్పింది' - శ్రీదేవి కూతురికి అదే ధైర్యం

09 March 2018-12:18 PM

తల్లి చనిపోయిన, ఏడు రోజులకే కుమార్తె పుట్టినరోజు జరుపుకోవడమేంటనే విమర్శలు ఓ పక్క, షెడ్యూల్‌ ప్రకారం సినిమా షూటింగ్‌కి హాజరు కావాల్సిన పరిస్థితి ఇంకోపక్క. ఇలాంటి కష్టం ఏ కూతురికీ రాకూడదు. అసలు అలాంటి పరిస్థితి వస్తుందని ఆమె కూడా అనుకోలేదు. అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. తన తొలి సినిమా చూడకుండానే, తన తల్లి తనకు దూరమవడాన్ని జాన్వీ జీర్ణించుకోలేకపోతోంది. సినిమా సంగతి తర్వాత, తన తల్లి తనకు ఇంత త్వరగా దూరమవుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు.

 

ఈ నేపథ్యంలో కపూర్‌ కుటుంబంలోని అమ్మాయిలంతా జాన్వీకపూర్‌కి అండగా నిలిచారు. ఆమె నుంచి 'తల్లిని కోల్పోయిన' బాధను కొంతైనా దూరం చేసేందుకోసం, పుట్టినరోజు జరిపారు. ఆ ఫొటోలు ఎలాగో బయటకు వచ్చేయడంతో వివాదం తెరపైకి తెచ్చింది. ఇంతలోనే ఆమె సినిమా షూటింగ్‌కి హాజరవ్వాల్సి వచ్చింది. దర్శక నిర్మాతలు నచ్చజెప్పారు, ఒప్పించారు. మళ్ళీ కపూర్‌ కుటుంబంలోని అమ్మాయిలంతా జాన్వీకి అండగా నిలిచారు. అయితే, షూటింగ్‌ స్పాట్‌లోనూ ఆమె ముబావంగానే కనిపించిందట. దాంతో యూనిట్‌ సిబ్బంది,

 

'శ్రీదేవి సెట్‌లో ఎలా వుండేవారో తెలుసా?' అంటూ జాన్వీని మోటివేట్‌ చేసేవారట. 'మీ అమ్మ నీతో లేదని ఎవరన్నారు? నువ్వు సినిమాల్లో నటిస్తున్నావంటే అందరికన్నా ఆనందించేది ఆమే. ఆమెకు సినీ పరిశ్రమతో వున్న అనుబంధం చాలా గొప్పది. ఇక్కడే, ఈ సినీ పరిశ్రమ చుట్టూనే ఆమె ఆత్మ తిరుగుతూ వుంటుంది..' అని జాన్వీకి అంతా నచ్చ జెప్పడంతో, 'అవును, అమ్మ చెప్పింది.. కష్టాల్లోనూ ధైర్యంగా వుండాలని' అని తనను తాను సముదాయించుకుంటూ, జాన్వీ షూటింగ్‌లో పాల్గొంటోందట. దట్స్‌ ద స్పిరిట్‌.

ALSO READ: మెహరీన్‌కి అంత సీన్‌ లేదా?