ENGLISH

శ్రీదేవి కూతుళ్లు సో హాట్‌ గురూ!

09 October 2017-17:00 PM

అందాల రాశి శ్రీదేవి. ఇప్పటికీ మీ ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరని ఆడిగితే చాలా ఎక్కువ మంది నుండి వచ్చే సమాధానం శ్రీదేవి అని. అంత అందగత్తె అలనాటి మేటి నటి శ్రీదేవి. వయసు పెరిగినా వన్నె తరగని అందం ఆమె సొంతం. అలాంటిది ఆమె కూతుళ్ల అందం గురించి మాట్లాడుకోవల్సి వస్తే, అంతకు మించే కానీ తక్కువ ఉంటుందా? అదే జరుగుతోంది. శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ఇద్దరే అందంలో. బాలీవుడ్‌ ఫంక్షన్స్‌కి ఒకరికి మించి ఒకరన్నట్లుగా హాట్‌ హాట్‌ గెటప్స్‌లో రెడీ అయి వస్తూ ఉంటారు. శ్రీదేవి తన కూతుళ్లను అలా ప్రమోట్‌ చేస్తోంది కాబోలు. ఒక్క ఫంక్షన్స్‌, పార్టీల్లోనే కాదండోయ్‌. ఇతరత్రా వెకేషన్స్‌కి వెళ్లినప్పుడు కూడా ఈ ముద్దుగుమ్మలు అంతే హాట్‌గా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ హాట్‌నెస్‌ అనేది హైఫై సొసైటీస్‌లో కామనే. అందులోనూ అతిలోక సుందరి అందాల శ్రీదేవి కూతుళ్లాయే. సో అస్సలు తగ్గడం లేదు. ఈ ముద్దుగుమ్మలు ఎక్కడ కనిపించినా, కెమెరా కళ్లు క్లిక్‌మనిపించకుండా ఉండవు. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో దర్శనమివ్వక మానవు. అయితే వెకేషన్స్‌ నిమిత్తం విదేశాల్లో వీరు ఎంజాయ్‌ చేసిన ఫోటోల్లో హాట్‌ హాట్‌ పోజులు సోషల్‌ మీడియాని మరీ హీటెక్కించేస్తూ ఉంటాయి. వాటిలో ఎక్కువ లీకేజీ ఫోటోలే అని టాక్‌. అయితే ఈ ఫోటోలను కావాలని వాళ్లే రిలీజ్‌ చేస్తూ ఉంటారని కూడా మరో పక్క టాక్‌ వినిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా సెలబ్రిటీస్‌కి ఇలాంటి పబ్లిసిటీనే కావాల్సింది. అదే జరుగుతోంది ఈ ముద్దుగుమ్మల విషయంలోనూ. ఎంతైనా శ్రీదేవి కూతుళ్లు కదా ఆమాత్రం ఉండాల్సిందే!

ALSO READ: ప్రముఖ తెలుగు యాంకర్ మృతి