ENGLISH

మెగాస్టార్‌ కోసం శ్రీదేవి దిగొస్తుందా?

13 June 2017-11:44 AM

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా కోసం శ్రీదేవితో సంప్రదింపులు జరుగుతున్నాయట. చిరంజీవే స్వయంగా తన సినిమాలో నటించాల్సిందిగా శ్రీదేవిని కోరగా, శ్రీదేవి అందుకు సమ్మతించిందన్న గాసిప్స్‌ వినవస్తున్నాయి. తెలుగు సినిమాల్లో నటించేందుకు శ్రీదేవి ఇప్పుడు ఇష్టంగానే ఉంది. ఇప్పటికే 'బాహుబలి' సినిమాలో ఛాన్స్‌ వదిలేసుకున్నందుకు బాధపడుతోన్న శ్రీదేవి, ఇకపై టాలీవుడ్‌ నుంచి వచ్చే ఏ బిగ్‌ ఆఫర్‌నీ వదులుకోవడానికి సిద్ధంగా లేదట. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా అప్పట్లో సూపర్‌ హిట్‌. అలాగే చిరంజీవితో 'ఎస్‌.పి. పరశురామ్‌' తదితర చిత్రాల్లో శ్రీదేవి చిరుతో జత కట్టింది. తాజాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రీదేవిని అడిగారని తెలియవస్తోంది. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో రాబోతున్న 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమా ఆగష్టులో సెట్స్‌ మీదకి వెళ్లనుంది. శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్‌ అయితే కాదట. కానీ ఒకవేళ ఈ గాసిప్‌ నిజమైతే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రాజెక్ట్‌కి ఇదొక అదనపు ఆకర్షణీయ అంశం అవుతుంది. ప్రస్తుతం శ్రీదేవి నటించిన 'మామ్‌' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 

ALSO READ: తెలంగాణ అసెంబ్లీలో మహేష్?!