ENGLISH

హిందీ ఛ‌త్ర‌ప‌తిలో రాజ‌మౌళి చేయి ఉందా?

16 July 2021-11:31 AM

తెలుగులో సూప‌ర్ హిట్ గా నిలిచిన ఛ‌త్ర‌ప‌తిని ఇన్నాళ్ల‌కు హిందీలో రీమేక్ చేస్తున్నారు. మ‌న బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరో. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభ‌మైంది. చ‌త్ర‌ప‌తి ఇప్ప‌టి సినిమా కాదు. వ‌చ్చి చాలా ఏళ్ల‌య్యింది. పైగా హిందీ డ‌బ్బింగ్ రూపంలో.. బాలీవుడ్ వాళ్లు సైతం చూసేశారు. మ‌రి ఇప్పుడు రీమేక్ చేస్తే.. ఆడుతుందా? అనేదే పెద్ద ప్ర‌శ్న‌.

 

అందుకు వినాయ‌క్ ద‌గ్గ‌ర స‌మాధానం కూడా ఉంది. ఛ‌త్ర‌ప‌తిలోని పాయింట్ ని ప‌ట్టుకుని, ఇప్ప‌టి ప్రేక్ష‌కుల అభిరుచికి, బాలీవుడ్ స్టైల్ కీ త‌గ్గ‌ట్టుగా రూపొందిస్తున్నార్ట‌. ఇప్ప‌టికే విజ‌యేంద్ర ప్ర‌సాద్ సెకండాఫ్ మొత్తం మార్చేశార‌ని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. ఇప్పుడు రాజ‌మౌళి స‌ల‌హాలు కూడా తోడ‌య్యాయ‌ట‌. ఛ‌త్ర‌ప‌తిలో కొన్ని కీల‌క‌మైన మార్పులు రాజ‌మౌళి సూచించార‌ని, అవి ఛ‌త్ర‌ప‌తిని వేరే స్థాయికి తీసుకెళ్ల‌బోతున్నాయ‌ని టాక్‌. వినాయ‌క్ - రాజ‌మౌళి మంచి స్నేహితులు. ఇద్ద‌రి మ‌ధ్యా మంచి రాపో ఉంది. ఆ చ‌నువుతోనే... రాజ‌మౌళి ద‌గ్గ‌ర వినాయ‌క్ స‌ల‌హాలు తీసుకున్నాడ‌ట‌. ఆ లెక్క‌న‌... ఈ రీమేక్ లో రాజ‌మౌళి చేయి ప‌డిన‌ట్టే.

ALSO READ: 'కుడి ఎడ‌మైతే' మూవీ రివ్యూ & రేటింగ్!