ENGLISH

Sudha Kongara: సుధా కొంగ‌ర‌ను ప‌ట్టించుకోవ‌డం లేదా?

24 November 2022-14:00 PM

గురు, ఆకాశ‌మే నీ హ‌ద్దులా లాంటి మంచి సినిమాలు అందిచిన ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర‌. ఆకాశ‌మే నీ హ‌ద్దురాకి జాతీయ అవార్డు కూడా వ‌చ్చింది. అయితే సుధా కొంగ‌ర‌ని తెలుగు హీరోలు, నిర్మాత‌లూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదేమో అనిపిస్తోంది. ఇటీవ‌ల ఆమె ఓ స్క్రిప్టు ప‌ట్టుకొని, తెలుగులోని టాప్ హీరోల వెంట తిరిగింది. అయితే.. ఏ హీరో కూడా సుధా క‌థ‌కి ఓకే చెప్ప‌లేదు. తిరిగి తిరిగి విసుగెత్తిపోయిన సుధా.. వెంట‌నే బాలీవుడ్ వెళ్లిపోయింది. ఇప్పుడు అక్క‌డ ఓ సినిమా ఓకే చేసుకొంది. అభిషేక్ బ‌చ్చ‌న్ హీరోగా సుధా కొంగ‌ర ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. ఇది .. ర‌త‌న్ టాటా బ‌యోపిక్ అని స‌మాచారం అందుతోంది. ఈ సినిమాని `కేజీఎఫ్‌` నిర్మాత‌లు తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది.

 

సుధా కొంగ‌ర లోని ప్ర‌తిభేంటో ఆమె చిత్రాలు నిరూపించాయి. సుధాకు అవార్డులు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. `నీతో సినిమా చేస్తాం` అని హీరోలంతా ఎగ‌బ‌డ‌డం, ఆ త‌ర‌వాత మొహం చాటేయ‌డం మామూలైపోయింది. `ఆకాశ‌మే నీ హ‌ద్దురా`కి అవార్డు వ‌చ్చిన‌ప్పుడు తెలుగులో ఒక‌రిద్ద‌రు హీరోలు ఆమెకు ట‌చ్ లోకి వెళ్లారు. `క‌థ ఉంటే చెప్పు. చేద్దాం` అని మాట ఇచ్చారు. తీరా క‌థ‌తో వెళ్తే.. హ్యాండిచ్చారు. దాంతో.. సుధా కొంగ‌ర బాలీవుడ్ కి వెళ్లిపోయింది.