ENGLISH

ఆమెకి మ‌హేష్ ఓకే చెప్పేశాడా?

25 April 2021-13:30 PM

ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... సుధా కొంగ‌ర‌. `ఆకాశం నీ హ‌ద్దురా`తో ఓ సూప‌ర్ హిట్ కొట్టిందామె. అప్ప‌టి నుంచీ.. టాలీవుడ్ బ‌డా హీరోల దృష్టి ఆమెపై ప‌డింది. ముఖ్యంగా మ‌హేష్ బాబు త‌న‌తో ఓ సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తన్నాడ‌న్న వార్త‌లొచ్చాయి. సుధా కొంగ‌ర కూడా మ‌హేష్ తో ప‌నిచేయ‌డానికి ఓ పాన్ ఇండియా ప్రాజెక్టుకు స‌రిప‌డా క‌థ సిద్ధం చేసింద‌ని టాక్‌.

 

ఆమ‌ధ్య `స‌ర్కారు వారి పాట‌` సెట్లో .. మ‌హేష్ ని క‌లిసింద‌ని, ఓ లైన్ కూడా చెప్పేసింద‌ని స‌మాచారం. ఆ లైన్ మ‌హేష్ కి కూడా న‌చ్చ‌డంతో `పూర్తి క‌థ సిద్ధం చేయ్‌` అని క్లియ‌రెన్స్ ఇచ్చాడ‌ట‌. కొద్ది రోజుల క్రిత‌మే.... పూర్తి స్థాయి క‌థ‌ని సిద్ధం చేసి, ఫైన‌ల్ డ్రాఫ్ట్ ని మ‌హేష్ కి పంపించింద‌ని స‌మాచారం. అయితే.. ఈ క‌థ చ‌దివిన త‌ర‌వాత‌.. మ‌హేష్ త‌న అభిప్రాయం చెప్పాల్సివుంది.

 

మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` త‌ర‌వాత త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేయాలి. ఆ వెంట‌నే రాజ‌మౌళి ప్రాజెక్టు ఉంటుంది. త్రివిక్ర‌మ్ సినిమాకీ, రాజ‌మౌళి సినిమాకీ మ‌ధ్య‌లో గ్యాప్ ఉంటే.. అప్పుడు సుధా కొంగ‌ర సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. లేదంటే.. క‌థ న‌చ్చినా, సుధా కొంగ‌ర మ‌రో రెండేళ్లు ఎదురు చూడాలి.

ALSO READ: ఇవేం క‌ల‌క్ష‌న్లురా బాబూ..?!