ENGLISH

సుధీర్ బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో మరో చిత్రం

15 November 2020-12:36 PM

`స‌మ్మోహ‌నం` తో ఆక‌ట్టుకున్న కాంబో.. సుధీర్ బాబు - ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ‌. ఆ సినిమాతో వీరిద్ద‌రి బాండింగ్ బాగా స్ట్రాంగ్ అయ్యింది. `వి` సినిమాలోనూ సుధీర్ బాబుకి ఓ స‌రికొత్త రోల్ ఇచ్చాడు ఇంద్ర‌గంటి. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోంది. సుధీర్ బాబు - ఇంద్ర‌గంటి కాంబోలో.. ఓ సినిమా రూపుదిద్దుకోనుంది.

 

ఇది రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌థానాయిక‌గా.. కృతి శెట్టిని ఎంచుకున్నారు. వైష్ణ‌వ్ తేజ్ `ఉప్పెన‌`లో కృతినే క‌థానాయిక‌. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అయినా స‌రే.. కృతికి వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ సినిమాతో మ‌రో అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న‌ట్టైంది. వివేక్ సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లయ్యాయి. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలుస్తాయి

ALSO READ: 'అమ్మోరు త‌ల్లి' మూవీ రివ్యూ & రేటింగ్!