ENGLISH

కామెడీ డైరెక్ట‌ర్‌తో సుధీర్ బాబు

12 July 2021-14:00 PM

న‌టుడిగా, ర‌చ‌యిత‌గా హ‌ర్ష‌వ‌ర్థ‌న్ సుప‌రిచితుడే. బుల్లి తెర‌పై `అమృతం` ఆయ‌న‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ త‌ర‌వాత‌.. వెండి తెర‌పైనా కామెడీ ప్ర‌ద‌ర్శించారు. `గుండెజారి గ‌ల్లంత‌య్యిందే`, `ఇష్క్` చిత్రాల‌కు ఆయ‌నే ర‌చ‌యితు. ఆ త‌ర‌వాత‌ ద‌ర్శ‌కుడిగానూ మారారు. `గుడ్ బాడ్ అగ్లీ` దర్శ‌కుడిగా ఆయ‌న తొలి చిత్రం. అయితే ఇంకా విడుద‌ల కాలేదు. ఇప్పుడు రెండో సినిమాకి అవ‌కాశం మాత్రం దొరికేసింది.

 

సుధీర్ బాబు హీరోగా, ఎస్వీసీ ఎల్ఎల్‌పీ సంస్థ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. దీనికి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ద‌ర్శ‌కుడు. సుధీర్ బాబు న‌టిస్తున్న 15వ చిత్ర‌మిది. ఆగ‌స్టులో చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతుంది. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ది ఎంట‌ర్‌టైన్‌మెంట్ మార్కు. ఈసారి కూడా ఆయ‌న అలాంటి క‌థే ఎంచుకున్నార్ట‌. ప్ర‌స్తుతం క‌థానాయిక‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయి. సుధీర్‌బాబు న‌టిస్తున్న `శ్రీ‌దేవి సోడా సెంటర్‌` చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా కూడా సెట్స్‌పై ఉంది.

ALSO READ: కండ‌ల‌తో క‌ట్టిప‌డేస్తున్న అఖిల్‌!