ENGLISH

Galodu: గాలోడు.... వ‌సూళ్ల‌న్నీ గాలి వార్త‌లేనా?

24 November 2022-10:00 AM

ఈమ‌ధ్య విడుదలైన చిత్ర చిత్రాల‌లో `గాలోడు` క‌ల‌క్ష‌న్లు ప్రేక్ష‌కుల్ని, చిత్ర వ‌ర్గాల్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. తొలి మూడు రోజుల్లోనే మూడు కోట్ల షేర్ సాధించింది. మొత్తానికి రూ.10 కోట్ల గ్రాస్ తెల్చుకొనే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అయితే.. ఈ వ‌సూళ్లు అంత న‌మ్మ‌శక్యంగా లేవ‌ని టాక్‌. తొలి రోజు గాలోడుకి రూ.1 కోటి రావ‌డం నిజ‌మే. కానీ ఆ త‌ర‌వాత గాలోడు వ‌సూళ్ల‌లో నిల‌క‌డ లేద‌ని, థియేట‌ర్ల‌లో జ‌నం క‌నిపించ‌లేద‌ని టాక్‌. ఈ సినిమాకి దాదాపుగా రూ.6 కోట్ల వ‌ర‌కూ బ‌డ్జెట్ అయ్యింద‌ని స‌మాచారం.

అటు థియేట‌రిక‌ల్ నుంచి, ఇటు డిజిట‌ల్ నుంచి వ‌చ్చిన మొత్తం చూసుకొంటే.. గాలోడు బొటాబొటీగా గ‌ట్టెక్కింద‌ని స‌మాచారం. నిజానికి గాలోడు లాంటి సినిమాని రూ.2 లేదా రూ.3 కోట్ల‌లో పూర్తి చేయాల్సింది. సుధీర్‌పై రూ.6 కోట్లంటే పెద్ద రిస్కే. అయినా స‌రే.. సుధీర్ ఆ డ‌బ్బుల్ని రాబట్టాడు. అదే సినిమాని రూ3 కోట్ల‌లో తీసుంటే నిర్మాత‌కి ఏకంగా 3 కోట్లు మిగిలేవి. సుధీర్ లాంటి హీరోల‌తో సినిమాలు చేస్తున్న‌ప్పుడు నిర్మాత‌లు బ‌డ్జెట్ లిమిట్స్ ని గుర్తు పెట్టుకొంటే బాగుండేది.

ALSO READ: Hit 8: 'హిట్ 8' కూడా వ‌స్తుంద‌ట‌!