ENGLISH

ఫ్లాప్ ఇచ్చినా... మ‌రోసారి న‌మ్మాడు.

17 November 2020-15:00 PM

చిత్ర‌సీమ‌లో `హిట్టు`కే విలువ‌. ఫ్లాపులిచ్చిన ద‌ర్శ‌కుడ్ని అస్స‌లుప‌ట్టించుకోరు. ఓ ఫ్లాప్ కాంబినేష‌న్ రిపీట్ అవ్వ‌డం అత్యంత అరుదుగా జ‌రిగే విష‌యం. ఇప్పుడు యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ కూడా.. త‌న‌కు ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. సందీప్ కిష‌న్ - జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబినేష‌న్‌లో `తెనాలి రామ‌కృష్ణ ఎల్.ఎల్‌.బి` వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

 

అయితే ఈ సినిమా ఫ్లాపైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ సెట్ట‌య్యింది. నాగేశ్వ‌ర‌రెడ్డి చెప్పిన క‌థ‌కి సందీప్ ఓకే చెప్పాడ‌ట‌. నిర్మాత‌లు కూడా దొరికేశారు. డిసెంబ‌రు నుంచి ఈసినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. `తెనాలి రామ‌కృష్ణ‌` ఫ్లాప్ అయినా, ఆ సినిమాపై మంచి హైప్ వ‌చ్చింది. దాంతో బిజినెస్ బాగా జ‌రిగింద‌ని టాక్‌. అందుకే.. ఇప్పుడు మ‌రోసారి చేయ‌డానికి రెడీ అయిపోయారు. ఈసారైనా హిట్టు కొడ‌తారో లేదో చూడాలి.

ALSO READ: చిరు తీరుపై చెల‌రేగుతున్న‌ విమ‌ర్శ‌లు.