ENGLISH

సన్నీలియోన్‌ మా ఊరికి రావొద్దూ!

16 December 2017-17:18 PM

సన్నీలియోన్‌ వస్తుందంటే చాలు జనం పోటెత్తేస్తున్నారు ఓ పక్క. అయితే ఈ ఊరిలో మాత్రం సన్నీలియోన్‌ వస్తే ఆత్మహత్యలు చేసుకుంటామంటున్నారు. ఏంటా ఊరు? ఏమా సంగతి..? అనుకుంటున్నారా. 

కర్ణాటకలో న్యూ ఇయర్‌ వేడుకలను స్పెషల్‌గా ప్లాన్‌ చేశారు. ఈ వేడుకలకు సన్నీలియోన్‌ గెస్ట్‌గా రాబోతోంది. అయితే కర్ణాటక రక్షణ వేదిక యువసేన సంఘం ఈ వేడుకకు సన్నీలియోన్‌ రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు. న్యూ ఇయర్‌ వేడుకలంటే మన సంస్కృతీ, సాంప్రదాయాల్సి ప్రతిబింబించేలా ఉండాలి. కానీ ఓ పోర్న్‌ స్టార్‌ ఈ వేడుకలకు రావడం మన సాంప్రదాయాల్ని అవమానించినట్లే అవుతుంది. అందుకే ఈ వేడుకలకు సన్నీలియోన్‌ రావడాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ, నగరంలోని మాన్యతా టెక్‌ పార్క్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు యువసేన సంఘాలు. ఆమె ఫోటోల్ని కూడా తగుల బెట్టారు. 

ఒకవేళ సన్నీలియోన్‌ గెస్ట్‌గా ఈ న్యూ ఇయర్‌ వేడుకలను గనుక నిర్వహిస్తే, యువసేన కార్యకర్తలు డిశంబర్‌ 31న సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామనీ హెచ్చరించారు. ఈ వివాదంపై కార్యక్రం నిర్వాహకుడు స్పందిస్తూ, ఇది ఒక కుటుంబ వేడుకలాంటిది. కర్ణాటక సంస్కృతిని అవమానపరిచేలా ఈ వేడుకను ఎందుకు నిర్వహిస్తాము. కేవలం సన్నీ ఓ కన్నడ పాటకు మాత్రమే డాన్స్‌ చేస్తారు. ఆమెకు వచ్చిన ఎన్నో బిగ్‌ ఆఫర్స్‌ని కాదనీ బెంగుళూర్‌పై ఉన్న ఇష్టంతోనే ఈ వేడుకు రానున్నారనీ, ఆమె రాకతో రాష్ట్ర సంస్కృతికి ఎలాంటి అవమానం జరగదనీ ఆయన అభిప్రాయపడ్డారు. అయినా కానీ యువసేన కార్యకర్తలు ఆందోళనలు ఆపేలా లేరు. 

సన్నీలియోన్‌ గత చరిత్ర బాగోలేదనీ, పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకుని ఈ వేడుకకు సన్నీ రావడాన్ని ఒప్పుకోమంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సన్నీలియోన్‌ ఇప్పటికే పలు కన్నడ చిత్రాల్లో నటించారు.ఇటీవలే తెలుగులో 'గరుడవేగ' చిత్రంలో ఐటెం సాంగ్‌లో నటించి, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. అయితే గత కొన్ని రోజులుగా సన్నీకి వ్యతిరేకంగా కర్ణాటకలో ఈ తరహా ఆందోళనలు జరుగుతున్నాయి. చూడాలి మరి సన్నీ ఈ వేడుకలకు హాజరవుతుందో లేదో!

ALSO READ: అనుష్క కి స్పెషల్ గిఫ్ట్ పంపిన దీపిక