ENGLISH

పుష్ష‌లో పోర్న్ స్టార్‌... ఎంత అడిగిందో తెలుసా?

26 July 2021-15:00 PM

టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్.. పుష్ష‌. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయ‌బోతున్నారు. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్. అంతేనా..? అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా ఇది. అందుకే ఇంత క్రేజ్‌. ఈ సినిమాకి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే, ఇందులో పోర్న్ స్టార్ స‌న్నిలియోన్ ఓ ప్ర‌త్యేక గీతంలో ఆడి పాడ‌బోతోంద‌ట‌. సుకుమార్ - దేవి శ్రీ కాంబినేష‌న్‌లో అదిరిపోయే ఐటెమ్ గీతాలెన్నో వ‌చ్చాయి. పుష్ష కోసం కూడా అలాంటి పాట ఒక‌టి సిద్ధ‌మైంది. ఈ పాట‌లో స‌న్ని క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌.

 

ఈ పాట కోసం స‌న్నిలియోన్ ఏకంగా 50 ల‌క్ష‌లు డిమాండ్ చేసింద‌ట‌. ఇది వ‌ర‌కు స‌న్ని ఎంత అడిగితే అంత ఇచ్చేవారు. ఆమె క్రేజ్ అలా ఉండేది. అయితే ఇప్పుడు స‌న్నీకి అంత లేద‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల టాక్‌. తెలుగులో స‌న్నిని ప‌ట్టించుకునేవాళ్లే లేరు. అలాంట‌ప్పుడు త‌న‌కి 50 ల‌క్ష‌లు ఇస్తార‌నుకోవ‌డం అత్యాసే. స‌న్నీ కూడా అంత డిమాండ్ చేయ‌కపోవొచ్చు కూడా. కాక‌పోతే... ఈసినిమాలో స‌న్ని ఉంటే ఇంకొంచెం ఎక్స్ ట్రా గ్లామ‌ర్ వ‌చ్చిన‌ట్టే. పుష్ష రెండు భాగాలు గా వ‌స్తోంది. మ‌రి స‌న్ని పాట ఏ పార్ట్ లో ఉంటుందో..?!

ALSO READ: మ‌రింత‌గా కూరుకుపోయిన రాజ్‌కుంద్రా