ENGLISH

'గరుడవేగ'లో సన్నీలియోన్‌ని చూస్తారా?

01 October 2017-08:48 AM

రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'గరుడవేగ'. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రత్యేకమట. అలాగే ఈ సినిమాకి స్పెషల్‌ అట్రాక్షన్‌ సన్నీలియోన్‌ ఐటెం సాంగ్‌. ఈ సాంగ్‌ని చాలా ప్రత్యేకంగా తెరకెక్కించారట. విష్ణుదేవా కొరియోగ్రఫీలో ఈ సాంగ్‌ కంపోజ్‌ చేయబడింది. ఇది పక్కా మాస్‌ మసాలా సాంగ్‌. దసరా సందర్భంగా ఈ సాంగ్‌ నుండి సన్నీలియోన్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది ఆ లుక్‌. చాలా క్రియేటివ్‌గా ఉంది కూడా. సన్నీ గ్లామర్‌తో పాటు, మాస్‌ స్టెప్పులు ఇరగదీసేసిందట ఈ పాటలో. 60 మంది ఆర్టిస్టులు, 100 మంది డాన్సర్స్‌తో ఈ సాంగ్‌ చిత్రీకరణ జరిగింది. ముంబయ్‌లో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్‌లో ఈ సాంగ్‌ షూటింగ్‌ చేశారు. తాజాగా విడుదలైన లుక్‌లో సన్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సాంగ్‌ సినిమాకే స్పెషల్‌ ఎట్రాక్షన్‌. గతంలోనూ సన్నీలియోన్‌ తెలుగులో నటించింది. మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన 'కరెంట్‌ తీగ' సినిమాలో సన్నీకి ఓ ఐటెం సాంగ్‌తో పాటు, కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓన్లీ ఐటెం సాంగ్‌లోనే నటిస్తోందనీ సమాచారమ్‌. ప్రవీణ్‌ సత్తారు సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆడియన్స్‌లో. ఈ సారి రాజశేఖర్‌ వంటి సీనియర్‌ హీరోతో ప్రవీణ్‌ సత్తారు ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కించాడనే ఆశక్తి ఉంది. ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని భావిస్తున్నారు.

ALSO READ: దిల్ రాజు నిర్మాణంలో 'భారతీయుడు 2'