ENGLISH

సూపర్ మెగా క్లాష్ : భోళా శంకర్ VS జైలర్

07 August 2023-15:33 PM

చిరంజీవి అండ్ రజనీకాంత్ ఇద్దరు ఇండియన్ సినిమాలో పెద్ద స్టార్స్ . ఒకరు మెగాస్టార్ అయితే ఇంకొకరు సూపర్ స్టార్. ఇద్దరు కూడా ఇంచు మించు ఒకే సమయంలో సినిమాల్లోకి వచ్చినవారే.. మొదటగా విలన్ పాత్రలు చేస్తూ తర్వాత బిగ్గెస్ట్ మాస్ హీరోలు గా ఎదిగిన వారు. అయితే ఇద్దరి స్టార్స్ మూవీస్ ఢీ కొట్టడానికి రెడీ గా ఉన్నాయి . రజినీకాంత్ జైలర్ జులై 10న, చిరంజీవి భోళా శంకర్ జులై 11న రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి . ఇది ఒక సూపర్ మెగా క్లాష్ అని చెప్పవచ్చు .


జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్  షోకేస్ అని ఒక వీడియో కూడా  రిలీజ్ చేశారు. వీడియో చూడటానికి కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది . రజిని యాక్షన్ అండ్ లూక్స్ మాస్ గా ఉన్నాయి . అలాగే భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ అయింది . ఇది ఇది ఫ్యామిలీ మాస్ కమర్షియల్ మూవీ లో ఉంది. రెండు మూవీస్ కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉన్నాయి. మూవీ టీమ్ అంతా  ప్రొమోషన్స్ లో బిజీ గా  ఉన్నారు .  ఏ  మూవీ ఆడియన్స్ కి రీచ్ అవుతుందో , ఎవరు మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారో  చూడాలి మరి.  రజిని జైలర్ , చిరు భోళా శంకర్ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం .