ENGLISH

మ‌ళ్లీ మెగాఫోన్ ప‌డుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి

14 September 2020-09:00 AM

ఎస్వీ కృష్ణారెడ్డి.. ఒక‌ప్పుడు చిన్న సినిమాల‌కు బ్రాండ్‌. య‌మ‌లీల సినిమాతో.. ప‌రిశ్ర‌మ ని షాక్ కి గురి చేశారు. సున్నిత‌మైన వినోదం, కుటుంబ బంధాల‌తో సాగే క‌థ‌లు ఇంటిల్లిపాదినీ అల‌రించేవి. ఆయ‌న సినిమాల్లోని పాట‌లూ.. సూప‌ర్ హిట్టే. య‌మ‌లీల‌కు సీక్వెల్ గా య‌మ‌లీల 2 తీశారు. ఆ త‌ర‌వాత‌.. ఆయ‌న సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌డానికి రెడీ అవుతున్నారు. రెండు క‌థ‌లు ఆయ‌న ద‌గ్గ‌ర సిద్ధంగా ఉన్నాయట‌. అందులో ఒక‌దాన్ని త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నారు.

 

``వినోదం సినిమా త‌ర‌హా క‌థ‌, క‌థ‌నాల‌తో ఓ స్క్రిప్టు రెడీగా ఉంది. పూర్తి వినోద భ‌రితంగా సాగే క‌థ అది. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు బాగోలేవు. షూటింగుల‌కు అనువైన వాతావ‌ర‌ణం లేదు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర‌వాత‌.. ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తా`` అన్నారు కృష్ణారెడ్డి. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో `య‌మ‌లీల‌.. ఆ త‌ర‌వాత‌` అనే ధారావాహిక నిర్మిత‌మైంది. ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఈ సీరియ‌ల్ లో అలీ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.

ALSO READ: త‌స్మాత్ జాగ్ర‌త్త అంటున్న రౌడీ!