ENGLISH

గ్లామ‌ర్ పాత్ర‌ల‌వైపు గాలి మ‌ళ్లిందా?

29 April 2021-16:00 PM

తెలుగులో తాప్సికి గ్లామ‌ర్ తార అనే ముద్రే ప‌డింది. బాలీవుడ్ లో అడుగుపెట్టేంత వ‌ర‌కూ.... ఆమెలోని న‌టి ప‌రిచ‌యం కాలేదు. పింక్ లాంటి సినిమాతో... ఒక్క‌సారిగా క్రేజ్ తెచ్చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌కు తాను ఇప్పుడు ఓ మంచి ఆప్ష‌న్‌. `అవార్డు సినిమాల‌కు తాప్సినే బెస్ట్` అనుకుంటున్నారు అక్క‌డివాళ్లంతా. అయితే.. ఈ త‌ర‌హా పాత్ర‌ల‌పై కూడా తాప్సికి బోర్ కొట్టేసి ఉంటుంది. అందుకే ఇప్పుడు మ‌ళ్లీ గ్లామ‌ర్ మంత్రం జ‌పిస్తోంది.

 

స‌డ‌న్ గా గ్లామ‌ర్ పాత్ర‌లంటే ద‌ర్శ‌కులూ జీర్ణం చేసుకోవాలి క‌దా. అందుకే.. మెల్ల‌మెల్ల‌గా త‌న‌లోని అందాల్ని మ‌ళ్లీ ప‌రిచ‌యం చేస్తోంది తాప్సి. ఇటీవ‌ల తాప్సి ఓ హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది. అందులో పాత రోజుల్ని గుర్తు చేస్తూ... హొయ‌లు పోయింది. ఆ స్టిల్స్ చూస్తే ఎవ‌రికైనా మ‌తులు పోవాల్సిందే. `నాకు క‌మర్షియ‌ల్ సినిమాల్లో న‌టించాల‌నివుంద‌హో` అంటూ ఈ ఫోజుల‌తో చెప్ప‌క‌నే చెప్పింది. మ‌రి.. ఇలాంటి ఆఫ‌ర్లు వ‌స్తాయో, రావో?

 

ALSO READ: Taapsee Latest Photoshoot