ENGLISH

డ‌బ్బు మ‌నిషికి కాదంటున్న తాప్సి

22 April 2021-13:00 PM

తెలుగు నాట అండ‌ర్ రేటెడ్ ఆర్టిస్ట్ తాప్సి. ఈమె ప్ర‌తిభ‌ని బాలీవుడ్ వాళ్లే గుర్తించారు. అందుకే అక్క‌డ ఆమెకు మంచి సినిమాలొచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ స్థానం ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే.. టాలీవుడ్ ఇప్ప‌టికీ ఆమెను విస్మ‌రిస్తూనే ఉంది. కాక‌పోతే.. తెలుగులో సినిమాలు చేయ‌ట్లేద‌న్న ఫీలింగ్ త‌న‌కు లేదంటోంది తాప్సి.

 

సినిమా అర్థం పూర్తిగా మారిపోయింద‌ని, బాషాబేధాల్ని సినిమా ఎప్ప‌టో చెరిపేసింద‌ని, త‌న పింక్‌... మారు మారు గ్రామాల‌కూ వెళ్ల‌గ‌లిగింద‌ని, అలాంట‌ప్పుడు ప్రాంతీయ భాష‌ల‌కు దూర‌మ‌య్యానన్న వెలితి త‌న‌కెక్క‌డిద‌ని అంటోంది తాప్సి. అయితే ఈమ‌ధ్య‌కాలంలో తెలుగులోనూ త‌న‌కు అవ‌కాశాలొచ్చాయ‌ట‌. ఆ సినిమాల‌న్ని ఒప్పుకుంటే..కొన్ని కోట్లు సంపాదించేదాన్న‌ని, అయితే త‌న ప్ర‌తిభ‌కు ప‌రీక్ష పెట్టే పాత్ర‌లు రాన‌ప్పుడు.. కోట్ల‌పై మోజు ఉండ‌ద‌ని చెప్పింది.

ALSO READ: రెండో సినిమాకే ప‌ది కోట్లా?