ENGLISH

అఖిల్‌ సినిమాలో టబు?

01 June 2017-18:12 PM

అఖిల్‌ కొత్త సినిమాకోసం సీనియర్‌ నటి టబుని ఫైనల్‌ చేశారట. అఖిల్‌ సినిమాలో టబు నటించడం ఇదే తొలిసారి కాదు. అఖిల్‌ చిన్న వయసులో వచ్చిన 'సిసింద్రీ' సినిమాలోనే నటించేసింది టబు. అయితే అప్పట్లో అఖిల్‌ చాలా చాలా చిన్న పిల్లాడు. నెలల వయసులోనే అఖిల్‌ ఆ సినిమాలో నటించాడు. ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమాలో కొడుకు సిసింద్రీతో పాటు నాగార్జున కూడా నటించాడు. టబు ఆ సినిమాలో నాగ్‌తో ఆడిపాడింది. టబుకీ, నాగ్‌కీ మధ్య కొన్ని సీన్స్‌ కూడా ఉంటాయి ఆ సినిమాలో. అయితే ఇప్పుడు అలా కాదు, టబుతో డైరెక్ట్‌గా ఆలీ చిందేయనున్నాడట. అఖిల్‌, విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టబుని ఓ క్యారెక్టర్‌ కోసం తీసుకున్నారట. నాగార్జునకి టబు అత్యంత సన్నిహితురాలు. ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'నిన్నే పెళ్ళాడతా', 'ఆవిడా మా ఆవిడే' తదితర సినిమాల్లో నటించింది టబు నాగార్జునతో. టబు, నాగార్జున ది బెస్ట్‌ పెయిర్‌ కూడా. ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ విషయంలో ఈ జంట టాప్‌ ర్యాంక్‌లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 'మనం' వంటి గొప్ప సినిమాని తెరకెక్కించిన విక్రమ్‌ కుమార్‌ అఖిల్‌తో ఈసారి తీయబోయే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

 

ALSO READ: 'అంధగాడు' అన్నింటికీ రెడీ!