కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు. కానీ శంకర్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమాని పూర్తి చేయాలన్న తపనతో ఉన్నాడు. ఇందులో కథానాయికగా కాజల్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే కాజల్ ఇప్పుడు గర్భవతి. తను మళ్లీ షూటింగులకు రావాలంటే యేడాదైనా సమయం పడుతుంది. అందుకే కాజల్ స్థానంలో మరో కథానాయికని వెదికిపట్టుకునే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. వాళ్ల దృష్టి తమన్నాపై పడిందని టాక్.
కమల్ హాసన్ తో సినిమా అంటే తమన్నా ఎగిరి గంతేయడం ఖాయం. కాకపోతే.. తనకు కొన్ని కండీషన్లు ఉన్నాయట. కమల్ సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు అత్యంత సహజం. అయితే.. అలాంటి సన్నివేశాల్లో నటించడం కుదరదని, తమన్నా ముందే చెప్పేసిందట. తను లిప్ లాక్‌లకు దూరం అని, అలాంటి సీన్లు ఉంటే చేయనని షరతు పెట్టిందట. దానికి శంకర్ సరే అన్నాడని టాక్. సో.. తమన్నా ఎంట్రీ దాదాపుగా ఖాయం అయిపోయినట్టే.
ALSO READ: నాలుగో రోజూ దుమ్ము రేపిన అఖండ