ENGLISH

'క్వీన్‌' తమన్నా చాలా మారిపోయిందా?

02 October 2017-11:05 AM

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ నటించిన 'క్వీన్‌' సినిమాతో కంగనా దశ తిరిగిపోయింది. అంతవరకూ కంగనాకున్న ఇమేజ్‌ ఈ సినిమాతో పదింతలైపోయింది. ఈ సినిమాని ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తెలుగులో క్వీన్‌గా తమన్నా నటిస్తుండగా, తమిళంలో కాజల్‌ అగర్వాల్‌, కన్నడలో పారుల్‌ యాదవ్‌, మలయాళంలో మంజిమా మోహన్‌ క్వీన్‌ పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో నీలకంఠ దర్శకత్వం వహిస్తుండగా, కన్నడ, తమిళ వెర్షన్‌కి రమేష్‌ అరవింద దర్శకత్వం వహిస్తున్నారు. ఒకేసారి నాలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి మనుకుమార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తమన్నా 'క్వీన్‌' పాత్ర తనకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నానంటోంది. ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్స్‌ని పరిశీలించారు. ముద్దుగుమ్మ త్రిషను ఆల్‌మోస్ట్‌ ఓకే చేసేశారనుకున్నారు. తాజాగా తమన్నా ఈ సినిమాకి ఎంపికైంది. సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. 'క్వీన్‌' పాత్రలో కంగనాని చూసి తాను చాలా ఇన్‌స్పైర్‌ ఆయ్యాననీ, ఆ పాత్రలో తానూ నటిస్తే బాగుండని అనుకుందట ఆ సినిమా చూసినప్పుడు తమన్నా. అయితే అనుకోకుండా, అదృష్టవశాత్తూ ఆ బంపర్‌ ఆఫర్‌ తనకే దక్కిందని తెగ సంబరపడిపోతోంది మిల్కీ బ్యూటీ. కంగనా నటించిని క్వీన్‌ సినిమాని 10 సార్లు చూసిందట. తెలీకుండానే ఆ పాత్రలో తాను ఇన్వాల్వ్‌ అయిపోయానంటోంది తమన్నా. ఇంతవరకూ తమన్నా ఎన్నో గ్లామరస్‌ పాత్రలో నటించింది. అవన్నీ ఒకెత్తు, క్వీన్‌ ఒక్కటీ ఒక ఎత్తు. ఈ సినిమా అనుకున్నప్పట్నుంచీ, అదే మూడ్‌లో ఉండిపోయిందట. ఆ పాత్రకి తనను తాను అంతగా మౌల్డ్‌ చేసుకున్నానంటోంది బ్యూటీ తమన్నా.

ALSO READ: జై లవకుశ,స్పైడర్ & మహానుభావుడు చిత్రాలలో ఏది బాగుంది?