ENGLISH

గని కోసం.. మిల్కీబ్యూటీ!

26 July 2021-12:00 PM

అగ్ర క‌థానాయిక‌ల్లో ఐటెమ్ సాంగుల‌న‌గానే చెంగున గంతులేసే భామ‌... త‌మ‌న్నా. టాప్ హీరోయిన్ల‌లో ఎక్కువ ఐటెమ్ గీతాలు చేసింది త‌మ‌న్నానే. ఇప్పుడు మ‌రో ఐటెమ్ సాంగ్ లో క‌నిపించ‌డానికి రెడీ అయ్యింది. అది కూడా మెగా హీరో సినిమాలో. వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `గ‌ని`. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఇందులో ఓ ప్ర‌త్యేక గీతం ఉంద‌ని తెలుస్తోంది. ఆ పాట‌లో త‌మ‌న్నా క‌నిపించ‌నుంద‌ట‌.

 

ఇటీవ‌ల చిత్ర‌బృందం త‌మ‌న్నాని సంప్ర‌దించ‌డం, త‌ను ఈ పాట‌లో న‌టించ‌డానికి ఒప్పుకోవ‌డం జ‌రిగిపోయాయి. త్వ‌ర‌లోనే.. త‌మ‌న్నా పై ఈ గీతాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఉపేంద్ర ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త‌మ‌న్నా ఐటెమ్ గీతంతో... ఈ సినిమాకి మ‌రింత క్రేజ్ పెరుగుతుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టిస్తారు.

ALSO READ: ప్ర‌ముఖ‌ నటి జ‌యంతి క‌న్నుమూత‌