ENGLISH

మిల్కీ బ్యూటీ ఈసారి ఖచ్చితంగా భయపెడుతుందట.

06 September 2020-13:40 PM

హీరోయిన్‌ తమన్నా, ‘రాజుగారి గది 3’లో నటించాల్సి వుంది. కానీ, సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళడానికి ముందే ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుంది. తమన్నా స్థానంలో అవికా గోర్‌ ఆ సినిమా చేసింది. సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టేసిందనుకోండి.. అది వేరే సంగతి. ఇక, ఇప్పుడు తమన్నా మరో థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌కి స్పెల్‌ బౌండ్‌ అయ్యిందని అంటున్నారు. ఓ యువ దర్శకుడు చెప్పిన కథకి తమన్నా ఫిదా అయ్యిందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం.

 

ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోయే ఈ సినిమా కోసం ఓ మోస్తరు బడ్జెట్‌ని ప్లాన్‌ చేస్తున్నారట. ఓ ప్రముఖ హీరో ఈ సినిమాలో అతిది¸ పాత్రలో కన్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే నవంబర్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనుందని సమాచారం. తమన్నాకి ద్రి¸ల్లర్‌ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో ఆమె ‘అభినేత్రి’ అనే సినిమాలో నటించింది కూడా.

 

అయితే, ఈసారి చేయబోయేది చాలా థ్రిల్లింగ్‌గా వుంటుందనీ, హర్రర్‌కి కాస్త కామెడీ టచ్‌ కూడా ఇవ్వనున్నారనీ, సినిమాలో ఒకింత గ్లామర్‌ డోస్‌ కూడా ఎక్కువే వుంటుందనీ అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో తమన్నా ‘సీటీమార్‌’తోపాటు మరో సినిమాలో నటిస్తోంది. ఇవి కాక, తమన్నా మరో బిగ్‌ ఛాన్స్‌ కూడా కొట్టేసిందనీ, ఓ ప్రముఖ హీరో సరసన హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం.

ALSO READ: Taapsee Latest Photoshoot