ENGLISH

విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన త‌మ‌న్నా

23 April 2021-15:23 PM

ఈమ‌ధ్య `లెవన్త్ అవ‌ర్‌` అనే వెబ్ సిరీస్ చేసింది త‌మ‌న్నా. త‌ను చేసిన తొలి వెబ్ సిరీస్ ఇది. అయితే ఈ సిరీస్ ఫ్లాప్ అయ్యింది. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కి అస‌లు స్పంద‌నే లేదు. క‌థ‌లో బ‌లం లేని ఈ వెబ్ సిరీస్ ని త‌మ‌న్నా ఎలా చేసిందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే దీని కోసం భారీ పారితోషికం అందుకుంద‌ని, అస‌లు డ‌బ్బుల కోస‌మే ఈ సిరీస్ చేసింద‌ని ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటిపై త‌మ‌న్నా స్పందించింది. ప్ర‌తీ విష‌యాన్నీ డ‌బ్బుల‌తో ముడిపెట్టి చూడొద్ద‌ని, కొన్నిసార్లు కొత్త అనుభూతుల కోసం, కొన్ని అనుభవాల కోసం కూడా ప‌నిచేయాల‌నుకుంటామ‌ని చెప్పుకొచ్చింది.

 

``వెబ్ సిరీస్ అనేది ఇప్ప‌టి ట్రెండ్. అస‌లు అక్క‌డ మేకింగ్ ఎలా ఉంటుంది? ప‌ని తీరేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాల‌నుకున్నా. అందుకే ఈ వెబ్ సిరీస్ చేశా. అంతే త‌ప్ప పారితోషికాల కోసం కాదు. డ‌బ్బు ప్ర‌ధాన‌మే. అయితే ప్ర‌తిసారీ కాదు`` అంది. కేవ‌లం డ‌బ్బుల కోస‌మైతే, వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు, ఐటెమ్ గీతాలూ చాల‌ని, రోజుల త‌ర‌బ‌డి సినిమాలూ చేయాల్సిన అవ‌స‌రం లేదని గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది.

ALSO READ: పెళ్ల‌య్యాక కూడా న‌టిస్తా: మెహ‌రీన్‌