ENGLISH

మ‌ళ్లీ దొరికేసిన త‌మ‌న్‌

16 November 2020-17:00 PM

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌. ఇప్పుడు త‌న హ‌వా కొన‌సాగుతోంది. పెద్ద హీరోల సినిమాల‌న్నింటికీ ఆల్ మోస్ట్ త‌నే సంగీతం అందిస్తున్నాడు. ట్యూన్లు ట్రెండీగా ఉంటాయ‌ని, కావ‌ల్సిన స‌మ‌యంలో ట్యూన్ సిద్ధం చేస్తాడ‌ని త‌మ‌న్‌కి మంచి పేరు. అయితే.. త‌న‌పై కాపీ క్యాట్ అనే ముద్ర కూడా ప‌డిపోయింది. `నేను కాపీ కొట్ట‌లేదు మ‌హా ప్ర‌భో` అని త‌మ‌న్ నెత్తీ నోరు కొట్టుకున్నా, `ఇదిగో కాపీ ట్యూను` అంటూ... వ‌ర్జిన‌ల్ వెర్ష‌న్‌కి తీస్తూనే ఉంటారు సంగీతాభిమానులు.

తాజాగా.. త‌మ‌న్ భాగోతం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న `క్రాక్‌` చిత్రంలోని `భూమ్ బ‌ద్ద‌ల్ భూమ్ బ‌ద్దల్‌` అనే పాట ఇటీవ‌ల విడుద‌లైంది. మంచి మాస్ బీట్ పాటిది. మంచి స్పంద‌న కూడా వ‌స్తోంది. అయితే.. ఇది కాపీ ట్యూన్ అని నెటిజ‌న్లు త‌మ‌న్ ని మళ్లీ ట్రోల్ చేయ‌డం మొద‌లెట్టారు. `ప్ర‌శ్నిస్తా` అనే ఓ చిన్న సినిమాలోని `ఏం ప‌ర్లేదేంప‌ర్లేదు..` అంటూ సాగే పాటకు సంబంధించిన బీట్‌ని లేపేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రెండు బీట్లూ దాదాపు ఒకేలా ఉండ‌డంతో.. ఈ విమ‌ర్శ‌కు బ‌లం చేకూరింది. దీనిపై త‌మ‌న్ ఏమంటాడో చూడాలి.

ALSO READ: తొలి అడుగు మెగా మేన‌ల్లుడిదే!