ENGLISH

టిల్లు స్క్వేర్ వసూళ్ళ జాతర

30 March 2024-14:32 PM

డీజే టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంతక ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు టిల్లు గాడు తెచ్చుకున్నాడు. ఈ మూవీ హిట్ అయ్యింది అంటే దానికి కారణం కేవలం సిద్దు యాక్టింగ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఆ మేనరిజం, తెలంగాణ మాండలికం, అన్నీ కలిపి సిద్దు కెరియర్ కి మంచి కిక్కు ఇచ్చే హిట్ దొరికింది.  టిల్లు గాడి మ్యాజిక్ కంటిన్యూ చేస్తూ  సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో టిల్లు స్క్వేర్ ఒకటి. మల్లిక్ రామ్  దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. 


శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ అనుకున్న అంచనాలను చేరుకుంది. తనని నమ్మి థియేటర్స్ కి వచ్చిన వారిని సిద్దు నిరుత్సాహ పరచలేదు. నిజంగా డబుల్ ఎంటర్టైన్ చేసాడని ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. మొదటి రోజే భారీ వసూళ్లు వచ్చాయని మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మొదటి రోజు 20 కోట్లకి పైగా వసూళ్లు చేస్తుంది అని అంచనా వేసిన మూవీ టీమ్ కి అంతకు మించి గ్రాస్ కలక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా టిల్లు స్క్వేర్  23.7 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఒక సెన్సేషనల్ ఓపెనింగ్ గా నిలిచింది. సిద్ధూ కెరీర్ లో ఇదే హైయస్ట్ గ్రాస్. 


సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ OTT హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం 15 కోట్ల చెల్లించినట్టు  టాక్. కేవలం ఓటిటి హక్కులతోనే టిల్లు సగానికి పైగా బడ్జెట్ సాధించాడు.  మొదటి రోజు వసూళ్లతో రికార్డ్ సృష్టించాడు. మొదటి పార్ట్ లో నటించిన నేహా శెట్టి సీక్వెల్ లో క్యామియో రోల్ లో కనిపించింది.