ENGLISH

ఆ బహుమతి నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది: బోనీ కపూర్

09 March 2018-19:33 PM

శ్రీదేవి మరణం అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది ఆమె భర్త బోనీ కపూర్ అని చెప్పొచ్చు. 

ఆరు పదులు దాటిన వయసులో ఇద్దరు ఆడ పిల్లలని చూసుకుంటూ తన భార్య లేని లోటుని తెలియకుండా చూసుకోవడం సామాన్య విషయం కాదనే చెప్పాలి. ఇక ఇందుకే ఆయన కుటుంబసభ్యులు స్నేహితులు రోజు ఆయన వద్దకి వచ్చి ఓదార్చి వెళుతున్నారట. 

అలాగే టీనా అంబాని ఈమధ్యనే వారింటికి వచ్చి తను శ్రీదేవి కలిసి దిగిన ఒక ఫోటోని ఫ్రేమ్ చేయించి బోనీ కపూర్ కి ఇవ్వడం జరిగిందట.
దీనితో వెంటనే ఆయన ఒక్కసారిగా తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడట. ఆ ఫోటో తనకి ఎప్పటికి గుర్తిండిపోయే బహుమతిగా మిగిలిపోతుంది అని చెప్పాడట.  

ఇక ఇవాల్టీ నుండే జాన్వీ కపూర్ తన సినిమా షూటింగ్ ని పునఃప్రారంభించింది.

 

ALSO READ: మళ్ళీ షూటింగ్ కి జాన్వీ కపూర్