ENGLISH

ఫస్ట్ డే కలక్షన్స్ తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే

09 December 2024-17:02 PM

బాహుబలి నుంచి పాన్ ఇండియా సినిమాలు మొదలయ్యాయి. అంతకముందు సౌత్ సినిమాలు సౌత్ భాషల్లో రిలీజ్ అవుతూనే ఉన్నా పాన్ ఇండియా పేరు తెరపైకి వచ్చింది మాత్రం బాహుబలి నుంచి అనటంలో సందేహం లేదు. బాహుబలి తరవాత RRR, పుష్ప, సలార్, కల్కి ఇవన్నీ ఎల్లలు చెరిపేసి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. దీనితో తెలుగు రీజనల్ సినిమా ఇండియన్ సినిమాగా అవతారమెత్తింది. ఇప్పుడిపుడే బాలీవుడ్ వాళ్ళ అహం తగ్గింది. నార్త్ వాళ్ళు భాషాభిమానం వదలి సినిమా ఏదైనా ఆదరించటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో బడ్జెట్ లెక్కలు మారుతున్నాయి, కలక్షన్స్ కూడా పెరుగుతున్నాయి.

ఇప్పడు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం అన్న తేడాలు లేవు కేవలం ఇండియన్ సినిమాగా పేరు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే కలక్షన్స్ లో టాప్ 10 మూవీస్ లిస్ట్ ఏంటో చూద్దాం. డిసెంబరు 5 పుష్ప 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి వసూళ్ళలో రికార్డ్ క్రియేట్ చేస్తూ ఫస్ట్ డే 294 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో  ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. అప్పటివరకు RRR మొదటి ప్లేస్ లో ఉండేది. పుష్ప రాజ్ రాకతో RRR సెకండ్ ప్లేస్ కి పడిపోయింది.

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబో మూవీ RRR 223 కోట్ల వసూళ్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. జక్కన్న, ప్రభాస్ కాంబో మూవీ బాహుబలి 2 సినిమా 210కోట్లు ఫస్ట్ డే కలక్షన్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఫోర్త్ ప్లేస్ లో ప్రభాస్ 'కల్కి' మూవీ నిలిచింది. కల్కి ఫస్ట్ డే వసూళ్లు 191 కోట్లు. ఫిఫ్త్ ప్లేస్ లో 178 కోట్లు కలక్షన్స్ తో ప్రభాస్ నటించిన సలార్ ఉంది. సిక్స్త్ ప్లేస్ లో ఎన్టీఆర్ దేవర 172 కోట్లు రాబట్టింది. సెవెంత్ ప్లేస్ లో 160కోట్ల కలెక్షన్స్ తో యష్ నటించిన KGF నిలిచింది. విజయ్ నటించిన లియో 148 కోట్ల వసూళ్లతో ఎయిత్ ప్లేస్ లో నిలచింది. నైన్త్ ప్లేస్ లో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ 140కోట్లు వసూలు చేసింది. టెన్త్ ప్లేస్ లో ప్రభాస్ నటించిన సాహూ 130 కోట్ల కలెక్షన్ రాబట్టింది.

ఇండియన్ టాప్ టెన్ సినిమాల లిస్టులో ఐదు సినిమాలు ప్రభాస్ వి నిలవటం గమనార్హం. బాహుబలి, కల్కి, సలార్, ఆదిపురుష్, సాహో టాప్ టెన్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ వి రెండు RRR, దేవర. చెర్రీ RRR , బన్నీ పుష్ప 2 తో టాప్ లో ఉన్నాడు. కోలీవుడ్ నుంచి విజయ్ లియో, కన్నడ నుంచి యష్ KGF ఉన్నాయి.