ENGLISH

వెంకీ, ర‌వితేజ‌పై ఆశ‌లు ఇంకా వ‌ద‌ల్లేదు

01 July 2021-14:00 PM

త్రినాథ‌రావు న‌క్కిన‌... ఏమిటో ఈ ద‌ర్శ‌కుడి ప‌రిస్థితి విచిత్రంగా ఉంటుంది. చేతిలో హిట్స్ ఉ,న్నా, మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించ‌డానికి తెగ స‌మ‌యం తీసుకుంటుంటాడు. `హ‌లో గురు ప్రేమ కోస‌మే` త‌ర‌వాత ఇంకో సినిమా ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు. ర‌వితేజ‌, వెంక‌టేష్‌.. వీరిద్ద‌రి చుట్టూ తిరిగి తిరిగి, వాళ్ల‌కు క‌థ‌లు చెప్పి, అందులో మార్పులూ, చేర్పులూ చేసుకున్నా, సెట్ అవ్వ‌క‌.. మ‌రో హీరో వేట‌లో ప‌డ్డాడు. హిట్ ద‌ర్శ‌కుడు అన్న బ్రాండ్ ఇమేజ్‌ని అస్స‌లు వాడుకోలేక‌పోయాడు.

 

అయితే త్రినాథ‌రావుకి.... వెంకీ, ర‌వితేజ సినిమాల‌పై ఆశ‌లు ఇంకా చావ‌లేదు. ఆ రెండు చిత్రాలూ త‌ప్ప‌కుండా ఉంటాయ‌ని చెబుతున్నాడు. వెంకీ, ర‌వితేజ‌ల కోసం రాసుకున్న క‌థ‌లు ఓకే అయిపోయాయ‌ని, హీరోల స‌మ‌యాభావం వ‌ల్ల ప‌ట్టాలెక్క‌లేద‌ని, త్వ‌ర‌లోనే ఆ రెండు సినిమాలూ క‌చ్చితంగా సెట్స్ పైకి వెళ్తాడ‌ని ఢంకా బ‌నాయించి మ‌రీ చెబుతున్నాడు. కాక‌పోతే.. ర‌వితేజ‌, వెంకీ ఇద్ద‌రూ మంచి స్వింగ్ లో ఉన్నారు. చేతి నిండా సినిమాలే. వాళ్లు ఖాళీ అవ్వాలంటే మ‌రో యేడాదైనా ప‌డుతుంది. అంత వ‌ర‌కూ న‌క్కిన త్రినాథ‌రావు త‌క్కిన వాళ్ల‌తో సినిమాలు చేసుకోవాల్సిందే.

ALSO READ: 'ఎం.ఆర్‌.ఓ' గా ర‌వితేజ‌?