ENGLISH

త్రిషకి ఈసారి అవార్డ్‌ ఖాయం

05 June 2017-16:36 PM

ముద్దుగుమ్మ త్రిషకు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అవకాశాలు వరదలా వచ్చి పడుతున్నాయి. త్రిష తాజాగా 'సదురంగవేట్టై-2' అనే సినిమాలో నటిస్తోంది. నిర్మల్‌కుమార్‌ దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హ్యాండ్‌సమ్‌ హీరో అరవింద్‌ స్వామి సరసన త్రిష నటిస్తుంది. నాలుగేళ్ళ చిన్నారికి తల్లిగా కనిపించనుంది త్రిష. తల్లి కూతుళ్ళ సెంటిమెంట్‌ సినిమాకే హైలైట్‌ అవుతుందట. మానస్వి అనే చిన్నారి, ఈ సినిమాలో త్రిష కుమార్తెగా నటించనుంది. జాతీయ స్థాయిలో త్రిషకి ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టేంత స్ట్రాంగ్‌ పాత్ర 'సదురంగవేట్టై-2' సినిమాలో ఆమెకు దక్కిందట. గతంలో అజిత్‌ సరసన ఓ బిడ్డకి తల్లి పాత్రలో త్రిష నటించింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తల్లి పాత్రల్లో నటించినా కానీ త్రిషలో గ్లామర్‌ ఏమత్రం తగ్గలేదు. అంతకు ముందు కన్నా రెట్టింపు అందంతో మెరిసిపోతోంది ముద్దుగుమ్మ త్రిష. 'నాయకి' సినిమాతో ఆకట్టుకోకపోయినా, త్రిష చేతిలో ప్రస్తుతం 10కి పైగా సినిమాలున్నాయి. ఈ ఏడాది అందులో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలు త్రిషకి మంచి పేరు తీసుకొచ్చే సినిమాలు కావడం విశేషం. ఓ పక్క గ్లామర్‌ పాత్రలతోనూ, మరో పక్క హుందా అయిన పాత్రలతోనూ మెప్పిస్తూనే హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తోనూ దుమ్ము దులిపేస్తోంది త్రిష. 

 

ALSO READ: 'మరకతమణి'తో పెట్టుకుంటే అంతే!