ENGLISH

Trivikram: త్రివిక్ర‌మ్ కి ఐటెమ్ సాంగ్ అవ‌స‌ర‌మా?

28 September 2022-12:00 PM

ఐటెమ్ సాంగ్ మంచి క‌మ‌ర్షియ‌ల్ వ‌స్తువు. ఏ ద‌ర్శ‌కుడైనా... ఎలాగోలా ఐటెమ్ సాంగ్ ని సినిమాలో ఇరికించాల‌ని చూస్తుంటాడు. రాజ‌మౌళికి కూడా ఇది త‌ప్ప‌లేదు. అయితే త్రివిక్ర‌మ్ ఐటెమ్ సాంగ్ గురించి ఎప్పుడూ ఆలోచించ‌లేదు. త‌న మ‌నస్త‌త్వం, ఆలోచ‌నా విధానం.. ఇందుకు దూరం. అయితే తొలిసారి త‌న సినిమాలో ఐటెమ్ గీతం పెట్ట‌బోతున్నాడు. అది కూడా మ‌హేష్ బాబు సినిమాలో.

 

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ సినిమా సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఓ ఫైట్ తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా కోసం త‌మ‌న్ బాణీలు స‌మ‌కూరుస్తున్నాడు. త్రివిక్ర‌మ్ సినిమా అంటే త‌మ‌న్ అల‌ర్ట్ అయిపోతాడు. మంచి ట్యూన్లు అందిస్తాడు. అందుకే వీరిద్ద‌రి కాంబినేష‌న్ సూప‌ర్ హిట్ట‌యింది. ఈసారి కూడా అదిరిపోయే ట్యూన్లు అందించాడ‌ని, అందులో ఓ ఐటెమ్ గీతం ఉంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఆ పాట‌లో ఓ స్టార్ హీరోయిన్ క‌నిపించ‌నుంద‌ని, ఈ ఐటెమ్ గీతం.. ఈ సినిమాకే స్పెష‌ల్ ఆఫ్ అట్రాక్ష‌న్ కానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఐటెమ్ గీతాల జోలికి వెళ్ల‌ని త్రివిక్ర‌మ్ కూడా ఇప్పుడు ఆ బాట‌లో న‌డ‌వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ALSO READ: మహేశ్‌బాబుకు మాతృవియోగం