ENGLISH

ఉదయభాను డబుల్‌ ధమాకా!

27 September 2017-18:09 PM

బుల్లితెర యాంకర్‌గా ఉదయభాను ఓ సెన్సేషన్‌. వల్టీ టాలెంటెడ్‌గా బోలెడంత అభిమానాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటు యాంకర్‌గా బుల్లితెరపైనా, అటు నటిగా వెండితెరపైనా సత్తా చాటింది బ్యూటిఫుల్‌ ఉదయభాను. సినీ ఈవెంట్స్‌లోనూ ఉదయభాను పేరే ముందు వరుసలో ఉండేది. పలు చిత్రాల్లో నటించి, వెండితెరపైనా ఓ వెలుగు వెలిగింది ఉదయభాను. 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాలో 'రాజశేఖరా.. నీపై మోజు తీరలేదురా' అంటూ ఐటెం సాంగ్‌లో తళుక్కున మెరిసింది. 'జులాయి'లోనూ ఓ సాంగ్‌లో కనిపించింది ఉదయభాను. అయితే వివాహానంతరం ఈ బ్యూటీ ఇలాంటి వ్యవహారాలన్నింటికీ బ్రేక్‌ ఇచ్చేసి లాంగ్‌ గ్యాప్‌ తీసుకుంది. ఇద్దరు అందమైన కవలలకు జన్మనిచ్చింది. మళ్లీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ఆల్రెడీ బుల్లితెరపై కొన్ని ఛానెల్స్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈవెంట్స్‌లోనూ కనిపిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా ట్రై చేస్తోంది. తెలంగాణా అమ్మాయి కావడం ఉదయభానుకి పెద్ద ప్లస్‌. ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో ఎక్కువగా తెలంగాణా ఫ్లేవర్‌ కనిపిస్తోంది. దాంతో సినిమాల్లో కూడా ఉదయభానుకి అవకాశాలు వరుస కడుతున్నాయనీ సమాచారమ్‌. ఈ రకంగా ఉదయభాను రీ ఎంట్రీలో బిజీ బిజీ అయిపోయింది. లేటెస్టుగా బుల్లితెరపై 'నీతోనే డాన్సులే' ప్రోగ్రాం ఉదయభాను హోస్ట్‌గా దసరాకి స్టార్ట్‌ కానుంది. ఈ డాన్స్‌ ప్రోగ్రామ్‌కి హీరోయిన్‌, పవన్‌ కళ్యాణ్‌ మాజీ సతీమణి రేణూదేశాయ్‌ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్