ENGLISH

'స్పైడర్‌'కి డిఫరెంట్‌ స్టైల్‌ పబ్లిసిటీ

22 September 2017-12:06 PM

'స్పైడర్‌' సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ జోరుగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. రెండు భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో పబ్లిసిటీని డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందింది. సో అక్కడా, ఇక్కడా కూడా పబ్లిసిటీని బాగా నిర్వహించాలనే ప్లానింగ్‌లో ఉంది చిత్ర యూనిట్‌. కొన్ని కొన్ని టీమ్స్‌గా విడిపోయి చిత్ర యూనిట్‌ పబ్లిసిటీకి సరికొత్త ప్లానింగ్స్‌ చేస్తోంది. మీడియాలో 'స్పైడర్‌' చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ని భారీగా నిర్వహించనుంది. మహేష్‌బాబు - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ట్రైలర్‌, పోస్టర్‌ స్టిల్స్‌తో కిర్రాకు పుట్టిస్తోంది ఈ జంట. తమిళంలో మహేష్‌ తొలిసారిగా నటిస్తున్న చిత్రం కూడా కావడంతో అక్కడి ప్రమోషన్స్‌లోనూ విరివిగా పాల్గొననున్నారు మహేష్‌. మరో పక్క ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఎస్‌.జె.సూర్యకి అక్కడి ఫాలోయింగ్‌ చాలా ఉంది. హీరోగా, దర్శకుడిగా, మంచి నటుడిగా గుర్తింపు ఉంది సూర్యకి తమిళంలో. అలాగే మరో యంగ్‌ హీరో భరత్‌ కూడా ఈ సినిమాలో నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకను ఫ్యాన్స్‌కి ఘనంగా అందించనున్నాడు మహేష్‌బాబు 'స్పైడర్‌'తో.

ALSO READ: దీక్షా చేసిన సంచలన వ్యాఖ్యలు