ENGLISH

రెమ్యున‌రేష‌న్ కూడా అన్ స్టాప‌బులే!

25 June 2022-14:00 PM

బాల‌య్య‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టింది... ఆహాలోని అన్ స్టాప‌బుల్‌. బాల‌య్య వాక్ చాతుర్యానికి, త‌న‌లోని కొంటెత‌నానికి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్ష‌కులు.

 

ఈ షోతో.. ఆయ‌నకు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా పెరిగారు. ఆ క్రేజ్‌... త‌న సినీ కెరీర్‌కి బాగా హెల్ప్ అయ్యింది. ఈ షో సూప‌ర్ హిట్ అవ్వ‌డం ఆహాకి బాగా ప్ల‌స్ అయ్యింది. అందుకే బాల‌య్య‌తో అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2ని మొద‌లెట్టారు. నిజానికి ఈ షో ఇంత పెద్ద హిట్ట‌వుతుంద‌ని అటు ఆహా, ఇటు బాల‌య్య ఇద్ద‌రూ ఊహించ‌లేదు. అందుకే సీజ‌న్ 1కి చాలా త‌క్కువ పారితోషికం అందుకొన్నారు. తొలి సీజ‌న్‌కి 10 ఎపిసోడ్ల‌కు గానూ... 2.5 కోట్లు అందుకొన్నార‌ని టాక్‌. ఇప్పుడు సీజ‌న్ 2 వ‌చ్చేస‌రికి.. ఆయ‌న పారితోషికం డ‌బుల్ అయ్యింద‌ని, ఈ సీజ‌న్‌కి ఆయ‌న రూ.5 కోట్ల పారితోషికం అందుకోబోతున్నార‌ని టాక్‌. ఈ సీజ‌న్‌లో 10 ఎపిసోడ్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. అంటే ఒక్కో ఎపిసోడ్ కీ రూ.50 ల‌క్ష‌ల‌న్న మాట‌. బాల‌య్య కెపాసిటీ, కెపాబులిటీకి రూ.50 ల‌క్ష‌లు అనేది త‌క్కువ పారితోషిక‌మే. మ‌రోవైపు గీతా ఆర్ట్స్ బాల‌య్య‌తో ఓ సినిమాప్లాన్ చేస్తోంది. అల్లు అర‌వింద్ తోనూ, మెగా ఫ్యామిలీతోనూ బాల‌య్య‌కు మంచి అనుబంధ‌మే ఉంది. అందుకే... త‌క్కువ పారితోషికానికి కూడా బాల‌య్య సై అన్నాడు. ఒకే రోజు రెండు ఎపిసోడ్ల‌ని పూర్తి చేసుకొంటే... కేవ‌లం 5 రోజుల్లో సీజ‌న్ 2 పూర్త‌యిపోతుంది. 5 రోజుల్లో రూ. 5 కోట్లంటే ఓ ర‌కంగా క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌నే.

ALSO READ: చోర్ బజార్ మూవీ రివ్యూ &రేటింగ్